ములుగు జిల్లాలో భారీ చోరీ.. 

ములుగు: ములుగు జిల్లాలోని దేవాదుల పంప్‌ హౌస్‌లో భారీ చోరీ జరిగింది. నిన్న అర్ధరాత్రి సిబ్బందిని కత్తులతో బెదిరించి విలువైన సామగ్రిని దొంగలు ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి  బైక్స్​పై వచ్చిన  ఐదుగురు గుర్తుతెలియని దుండగులు  కన్నాయిగూడెం మండలం సబ్ స్టేషన్ వద్ద ఉన్న దేవాదుల పంప్ హౌజ్‌ వద్దకు వచ్చి సెక్యూరిటీ సిబ్బందిని కత్తులతో బెదిరించారు.

అనంతరం పంప్‌ హౌస్‌లో కి వెళ్లి సిబ్బందిని నిద్ర లేపి  వారిని పంప్‌ హౌస్‌లోకి తీసుకెళ్లి కాపర్​ వైర్, ఇతర సామగ్రిని తీసుకెళ్లారు. సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగలను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.