నాగోల్ లో భారీ చోరీ.. ఈ సారి గేటెట్ కమ్యూనిటిలో..

నాగోల్ లో భారీ చోరీ.. ఈ సారి గేటెట్ కమ్యూనిటిలో..

 హైదరాబాద్ లో భారీ చోరీ జరిగింది. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోల్డెన్ విల్లా గేటెట్ కమ్యూనిటీలో రెండు ఇండ్లలో చోరీ చేశారు కేటుగాళ్లు.  22, 89 విల్లాస్ లో ఎవ్వరు లేకపోవడంతో ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు దుండగులు.  ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు ఆభరణాలు అపహరించారు. మరుసటి రోజు ఇంటి ఓనర్స్ వచ్చి చూడగా ఇంట్లోని సామాను.. డోర్స్ పగిలిపోయి ఉండటంతో పోలీసులకు ఫోన్ చేశారు. 

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సీసీ కెమెరాలో రికార్డు అయిన దొంగల విజువల్స్ ను పరిశీలించారు. ఇంట్లో బంగారు ఆభారణాలు ఎత్తుకెళ్లినట్టు బాధితులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు.