- ఇంకా కొన్ని నగలను అక్కడే వదిలేసి వెళ్లిన దొంగలు
- ఆధారాలు దొరక్కుండా చేతికి గ్లౌజులు, ముఖానికి మాస్క్‌లు
- కూకట్పల్లి లోని జయనగర్‌లో ఘటన
- తెలిసిన వారి పనేనని అనుమానం
కూకట్పల్లి, వెలుగు: కూకట్పల్లి పరిధిలోని జయనగర్‌లో గురువారం రాత్రి భారీ చోరీ జరిగింది. ముఖానికి మాస్క్‌లు, చేతులకు గౌజులు వేసుకొని, దర్జాగా అపార్ట్మెంట్లోని ప్రవేశించిన ఇద్దరు దొంగలు దాదాపు రూ.కోటి సొత్తును ఎత్తుకెళ్లారు. పోలీసుల వివరాల ప్రకారం.. ప్రముఖ బిల్డర్ అయిన మధుసూదన్‌రావు తన భార్య ప్రభావతితో కలిసి జయనగర్లోనిసీతాప్యాలెస్అపార్ట్మెంట్ఫ్లాట్నంబర్301లో ఉంటున్నాడు. మియాపూర్‌లోని వీరి కూతురు డెలివరీ కావడంతో 15 రోజులుగా ప్రభావతి అక్కడే ఉంటోంది.
మధుసూదన్‌రావు సైతం గురువారం రాత్రి కూతురు ఇంటికి వెళ్లాడు. శుక్రవారం ఉదయం తన ఇంటికి తిరిగొచ్చేసరికి తలుపు సెంట్రల్‌లాక్ పగులగొట్టి ఉంది. బెడ్రూమ్లోని డ్రెస్సింగ్టేబుల్లోలాకర్ ఉండగా, అందులో బీరువా తాళాలు పెట్టారు. దొంగలు ఈ లాకర్నుఓపెన్చేసి, ఆ తాళాలతో బీరువాలోని సుమారు 82 తులాల బంగారు ఆభరణాలు, రూ. 10 లక్షల డైమండ్ నెక్లెస్, రూ. 2 లక్షల నగదు ఎత్తుకెళ్లారు.
సీసీ కెమెరాలకు గొడుగు అడ్డం పెట్టుకుని..
అయితే, డ్రెస్సింగ్ టేబుల్ లాకర్‌తోపాటు బీరువాలోని ఇంకా కొన్ని నగలను దొంగలు అక్కడే వదిలేసి వెళ్లడంతో ఇది తెలిసిన వారి పనేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దొంగలు రాత్రి 1.30 సమయంలో మెయిన్ గేటు నుంచే దర్జాగా అపార్ట్మెంట్లోకి ప్రవేశించినట్టు గుర్తించారు. మెట్ల నుంచి మూడో ఫ్లోరుకు చేరుకుని చోరీకి పాల్పడ్డారు.
నిందితులు ముఖానికి మాస్క్‌లు, మఫ్లర్లు పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. చేతులకు గౌజులు వేసుకున్నట్టు క్లూస్‌టీమ్ సభ్యులు గుర్తించారు. దీన్ని బట్టి పక్కా ప్లాన్ ప్రకారమే దుండగులు చోరీకి పాల్పడినట్టు స్పష్టమవుతోంది. పరారయ్యే సమయంలో ఇంట్లోని గొడుగు తీసుకొని, సీసీ కెమెరాలకు అడ్డంపెట్టుకొని వెళ్లారు. ఈ సమయంలో వాచ్మెన్మద్యం తాగి పడుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.