BSNL యూజర్లకు గుడ్ న్యూస్..త్వరలో5G సేవలు..జియో,ఎయిర్ టెల్కు ముప్పు తప్పదా?

BSNL యూజర్లకు గుడ్ న్యూస్..త్వరలో5G సేవలు..జియో,ఎయిర్ టెల్కు ముప్పు తప్పదా?

ప్రభుత్వ రంగ టెలికం ఆపరేటర్ BSNL దూసుకుపోతోంది. ఇటీవల 4G సేవలను దేశ వ్యాప్తంగా విస్తరించిన బీఎస్ ఎన్ ఎల్..-స్పీడ్ కనెక్టివిటీని అందించేందుకు 5G సేవలను అందుబాటులోకి తీసుకొస్తుంది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ను పునరుద్దరించేందుకు టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT) నుంచి  రూ.61వేల కోట్లకు 5G స్పెక్ట్రమ్‌ను పొందింది. ఈ కేటాయింపు BSNL తన 5G సేవలను అందించడం ద్వారా టెలికాం రంగంలో తిరిగి పుంజుకుని ప్రత్యర్థి టెలికం ఆపరేటర్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. 

BSNL  తన కస్టమర్లకు 5G సేవలను అందించేందుకు సిద్దమవుతోంది. మొదటగా ఢిల్లీలో 5G సేవలను ప్రారంభించాలని యోచిస్తోంది. 2025 జూన్ నాటికి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం BSNL ప్రీమియం వీటిలో 700 MHz, 3300MHz 5G స్పెక్ట్రమ్ బ్యాండులను కొనుగోలు చేసింది. ఇవి హైస్పీడ్ కనెక్టివిటీని అందించనున్నాయి.  ప్రస్తుతం టవర్ ఇన్ స్టాలేషన్ వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ది చేస్తున్నారు. 

BSNL పునరుద్దరణలో భాగంగా 5G సేవలను అందుబాటులోకి తెస్తున్నారు. ఇటీవల4G  సేవల విస్తరణకు 6వేల కోట్ల ప్యాకేజీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు BSNL పునరుద్దరణకు రూ. 3.22లక్షల కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించింది. BSNL పునరుద్ధరణ ప్రణాళిక విజయవంతమైతే ముఖేష్ అంబానీకి చెందిన Jio, సునీల్ మిట్టల్ కు చెందిన ఎయిర్‌టెల్‌కు పెద్ద ముప్పును పొంచి వుందని టెలికం ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.