మాదారం అడవిలోకి పెద్దపులి

 మాదారం అడవిలోకి పెద్దపులి

తాండూరు, వెలుగు : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి అటవీ రేంజ్‌‌‌‌ పరిధిలో హల్‌‌‌‌చల్‌‌‌‌ చేసిన పెద్దపులి ఆదివారం రాత్రి తాండూరు మండలంలోని మాదారం అడవుల్లోకి వచ్చినట్లు ఆఫీసర్లు గుర్తించారు. ఇన్ని రోజులు బెల్లంపల్లి, కాసిపేట మండలాల్లో తిరిగిన పులి కన్నాల ప్రాంతంలోని అడవుల గుండా తాండూరు మండలం మాదారం బీట్‌‌‌‌లోకి వచ్చిందని ఆఫీసర్లు చెప్పారు. 

పెద్దపులి పాదముద్రలను గుర్తించిన ట్రాకింగ్‌‌‌‌ టీమ్‌‌‌‌ పులి ఎటువైపు వెళ్లిందన్న సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. మాదారం అటవీ ప్రాంతంలో పెద్దపులి తిరుగుతుండడంతో సమీప గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని డిప్యూటీ రేంజ్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ తిరుపతి సూచించారు. పెద్దపులి తిర్యాణి, రెబ్బెన మండలంలోని పులికుంట వైపు వెళ్లి ఉంటుందని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు.