పెద్దవాగులో పెద్దపులి..పాదముద్రలను గుర్తించిన జాలర్లు

పెద్దవాగులో పెద్దపులి..పాదముద్రలను గుర్తించిన జాలర్లు

దహెగాం, వెలుగు : దహెగాం మండల కేంద్రం, పెంచికల్​పేట్ మండలంలోని గుంట్లపేట్​మధ్యలో ఉన్న పెద్దవాగులో పులి పాదముద్రలు గుర్తించినట్టు పెంచికల్​పేట్​డిప్యూటీ రేంజ్​ఆఫీసర్​జలీల్​అహ్మద్​ తెలిపారు. గుంట్లపేటకు చెందిన జాలర్లు పెద్దవాగులో పులి కనిపించినట్టు చెప్ప డంతో అక్కడికి చేరుకొని పులి పాదముద్రలను గుర్తించారు. పులి దహెగాం మండల కేంద్రం వైపు వాగు దాటి మళ్లీ వెనక్కి వెళ్లిపోయిందని, మండల ప్రజలు భయపడవద్దని అన్నారు. 

గుంపులుగా పోవాలె

రైతులు చేన్లలో పనికి వెళ్లేటప్పుడు గుంపులుగుంపులుగా వెళ్లాలని రెబ్బెన ఎఫ్ఆర్​వో నిజాముద్దీన్​ సూచించారు. పులుల సంచారం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దహెగాం మండలంలోని లగ్గాంలో ఆయన అవగాహన కల్పించారు.  రైతులు ఒంటరిగా చేనులు, వాగుల వద్దకు వెళ్లవద్దని సూచించారు.

సాయంత్రం 4 గంటల వరకు పనులు ముగించుకొని ఇండ్లకు చేరుకోవాలన్నారు. మాస్కులు ధరించాలని, దీంతో పులి దాడి చేసే అవకాశం తక్కువగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్లు సద్దాం హుస్సేన్, రవి, ఎఫ్​బీవోలు వెంకటేశ్, సద్దాం, సురేందర్​ పాల్గొన్నారు.