అత్తాపూర్ లోని కీచక టీచర్ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడు విష్ణును ఎస్ఆర్ డీజి స్కూల్ యాజమాన్యం కాపాడే ప్రయత్నం చేసింది. కానీ విషయం తెలుసుకున్న విద్యార్థిని కుటుంబ సభ్యులు, బంధువులు పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఉదయం ఎప్పటిలాగే స్కూల్ కు వచ్చిన విష్ణుకు యాజమాన్యం విషయమంతా చెప్పి.. తన సెల్ ఫోన్ ను స్వీచ్ ఆఫ్ చేయించి... స్కూల్ లోపల దాచిపెట్టింది. విద్యార్థిని కుటుంబ సభ్యులు విష్ణు ఎక్కడా అని అడిగితే అతను స్కూల్ కు ఇంకా రాలేదని, అతని ఫోన్ కూడా స్వీచ్ ఆఫ్ వస్తుందంటూ బుకాయించింది. కానీ విద్యార్థిని కుటుంబ సభ్యులు విష్ణును కనిపెట్టి బయటకు పట్టుకొచ్చి చితకబాది పోలీసులకు అప్పగించారు.
ఇంతకీ ఏం జరిగింది?
రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్ లో స్ఆర్ డీజి స్కూల్ లో విష్ణు అనే వ్యక్తి పీఈటీగా పనిచేస్తున్నాడు. అయితే గత కొద్ది రోజులుగా విష్ణు.. ఆ స్కూల్ లో 8 తరగతి చదువుతోన్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా విద్యార్థినికి ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టడంతో విద్యార్థిని ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పేసింది. దీంతో ఆమె తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ కు చేరుకుని దాడికి దిగారు. అయితే అప్పుడు విష్ణు ఇంకా స్కూల్ కు రాలేదని అతని ఫోన్ కూడా స్వీచ్ ఆఫ్ వస్తుందంటూ స్కూల్ యాజమాన్యం బుకాయించింది. చివరికి అతని జాడ కనిపెట్టి బడిత పూజ చేసి పోలీసులకు అప్పగించారు విద్యార్థిని కుటుంబ సభ్యులు.