దువ్వాడ వివాదంలో బిగ్​ ట్విస్ట్​.. అది ఏంటంటే..

దువ్వాడ వివాదంలో బిగ్​ ట్విస్ట్​.. అది ఏంటంటే..

దువ్వాడ ఇంటి వివాదంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి నిరసన వ్యక్తం చేస్తున్న ఇల్లు దివ్వెల మాధురి పేరుతో రిజిస్ట్రేషన్ అయింది. టెక్కలి నియోజకవర్గం అక్కవరంలోని తన ఇంటిని దివ్వెల మాధురికి దువ్వాడ శ్రీనివాస్ రాసిచ్చారు. అంతేకాదు ఆమె పేరుపై రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ మేరకు దివ్వెల మాధురి ఆ ఇంట్లోనే ఉంటున్నారు. బాల్కనీపై అటు తిరుగుతున్నారు. దీంతో దువ్వాడ వాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుమార్తెతో కలిసి ఆ ఇంటి వద్ద నిరసనకు దిగారు. అయితే ఆ ఇంట్లోకి వెళ్లొచ్చని టెక్కలి కోర్టు అనుమతించింది. ఈ మేరకు కుటుంబ సభ్యులతో కలిసి వాణి ఆ ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై వాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకూ అక్కడి నుంచి వెళ్లమని వాణి కుటుంబం బైఠాయించింది. దీంతో దువ్వాడ వివాదం మళ్లీ రచ్చకెక్కింది.

అయితే దివ్వెల మాధురి మాత్రం ఆ ఇల్లు తనదేనని చెబుతున్నారు. తనకు దువ్వాడ శ్రీనివాస్ రూ. 2 కోట్లు ఇవ్వాలని అందువల్ల అక్కవరం ఇంటిని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించారని ఆమె తెలిపారు. తన ఇంటి వద్ద దువ్వాడ వాణి అల్లరి చేస్తున్నారని మండిపడ్డారు. తన ఇంటికి కరెంట్ సైతం నిలిపించారని ఆరోపించారు. ఇంటి సీసీ టీవీ ఫుటేజ్ పని చేయకుండా పవర్ కట్ చేయించారని దువ్వాడ మాధురి వ్యాఖ్యానించారు.

నా ఇంట్లో నేనున్నాను… వాళ్లెవరు నా ఇంట్లోకి రావడానికి అంటూ వాణి తీరుపై మాధురి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇళ్లు తనదేనని.. దువ్వాడ శ్రీను ఇంటిని తన పేరు మీద రాశారని చెబుతూ సెల్ఫీ వీడియో రిలీజ్‌ చేశారు. ఇంటి రిజిస్ట్రేషన్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్‌ చూపించారు మాధురి. రిజిస్ట్రేషన్‌ ఎట్టి పరిస్థితిలోనూ చెల్లదంటోంది దువ్వాడ వాణి. కోర్టు పర్మిషన్‌ తెచ్చుకుంటున్నామని తెలిపి… హుటాహుటిన ఇంటిని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నంత మాత్రన తనదైపోదంటున్నారు వాణి. ఇంటి కోసం ఎలాంటి ఫైట్‌కైనా సిద్ధమంటున్నారు. మొత్తంగా… గత నెల రోజుల నుంచి కంటిన్యూ అవుతున్న ఈ దువ్వాడ ఎపిసోడ్‌.. ఇంకెంత దూరం వెళ్తుందో… చూడాలి.