కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్

కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్

హైదరాబాద్: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు నాగార్జున వేసిన పరువు నష్టం దావా పిటిషన్పై నాంపల్లి స్పెషల్ కోర్టులో బుధవారం(అక్టోబర్ 23, 2024) విచారణ జరిగింది. కొండా సురేఖ తరపున అడ్వకేట్ గుర్మిత్ సింగ్ వకాలత్ ఫైల్ చేశారు. తదుపరి విచారణను అక్టోబర్ 30కి నాంపల్లి స్పెషల్ కోర్ట్ వాయిదా వేసింది. మంత్రి కొండా సురేఖకు నాంపల్లి స్పెషల్ కోర్టు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. హీరో నాగార్జున వేసిన క్రిమినల్‌‌, పరువునష్టం దావా కేసులో వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

Also Read : భూదాన్ ల్యాండ్స్ అన్యాక్రాంతం

అక్కినేని నాగ చైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆర్ కారణమంటూ కొండా సురేఖ చేసిన కామెంట్స్‌‌పై నాగార్జున కోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌‌పై కోర్టు విచారణ జరిపింది. ఓపెన్‌‌ కోర్టులో నాగార్జున సహా సాక్షులుగా ఉన్న యార్లగడ్డ సుప్రియ, మెట్ల వెంకటేశ్వర్లు వాంగ్మూలాన్ని న్యాయమూర్తి ఇప్పటికే రికార్డు చేశారు. నాగార్జున అందించిన ఆధారాలను పరిగణలోకి తీసుకున్నారు. నాగార్జునపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇవ్వాలని కొండాకు జారీ చేసిన నోటీసుల్లో కోర్టు పేర్కొంది.