హైదరాబాద్: మాజీ మంత్రి కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల ఫామ్ హౌస్ కేసు విచారణలో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగుచూస్తున్నాయి. రాజ్ పాకాల జన్వాడ ఫామ్ హౌస్ విచారణ భారీ బందోబస్తు నడుమ కొనసాగుతుంది. అంతేకాదు.. రాజ్ పాకాల జన్వాడ ఫామ్ హౌస్ కేసు విచారణ కీలక మలుపు తిరిగింది. అదిలాబాద్ బీఆర్ఎస్ సీనియర్ నేత జాన్సన్ నాయక్ ఎంట్రీతో కేసు కొత్త మలుపు తిరిగింది.
విచారణలో భాగంగా ఖానాపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన జాన్సన్ నాయక్ ఫామ్ హౌస్ వద్దకు చేరుకున్నారు. రాజ్ పాకాలతో పాటు ఫామ్ హౌస్ లోపలికి ఇతనిని మాత్రమే పోలీసులు అనుమతించారు. ఫామ్ హౌస్లో విచారణ ముగిసిన అనంతరం రాజ్ పాకాలను తిరిగి మోకిల పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు.
ALSO READ | రాజ్ పాకాల సమక్షంలోనే పార్టీ జరిగిన ఫాంహౌస్లో తనిఖీలు
మోకిల పోలీస్ స్టేషన్లో రాజ్ పాకాలను పోలీసులు ఇప్పటికే 3 గంటల పాటు విచారించారు. ఫామ్ హౌస్లో పార్టీ జరిగిన తీరు, మాదక ద్రవ్యాల వినియోగంపై ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న రాజ్ పాకాలను పోలీసులు విచారించారు. 22 మందికి డ్రగ్స్ర్యాపిడ్ టెస్ట్‌లు చేయగా ప్రముఖ వ్యాపారి విజయ్ మద్దూరి కొకైన్ తీసుకున్నట్లు నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. అయితే.. అసలు రాజ్ పాకాలకు కొకైన్ ఎలా వచ్చిందనే కోణంలో పోలీసులు విచారణ జరిపారు.