పెద్ద ట్విస్టే ఇది.. మంచు మనోజ్ ఇంటి చుట్టూ విష్ణు మనుషులు కాపలా !

హైదరాబాద్: మంచు కుటుంబంలో గొడవలకు సంబంధించి సోమవారం(డిసెంబర్ 09, 2024) కీలక పరిణామం చోటు చేసుకుంది. మంచు మనోజ్ ఇంటి చుట్టూ విష్ణు మనుషులు కాపలా ఉన్నారు. జల్పల్లిలో ఉంటున్న మంచు మనోజ్ ఇంటికి విష్ణు పాట్నర్ విజయ్ వెళ్లాడు. మనోజ్ ఇంటి సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ను విజయ్  తీసుకెళ్లినట్లు తెలిసింది. ఫ్యామిలీలో విభేదాలు రచ్చకెక్కడంతో విష్ణు దుబాయ్ నుంచి హుటాహుటిన హైదరాబాద్కు వచ్చాడు. జల్పల్లిలోని మంచు మనోజ్ ఇంటికి విష్ణు వెళ్లనున్నట్లు సమాచారం.

అసలేం జరిగిందంటే..
 సినీ నటుడు మోహన్​బాబు కుటుంబంలో గొడవలు భగ్గుమన్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. కొన్నాళ్లుగా సినీ నటుడు మోహన్ బాబు ఆయన కొడుకు మంచు మనోజ్, ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యులు జల్పల్లిలోని ఫాంహౌస్​లో ఉంటున్నారు. ఆదివారం తన తండ్రి దాడి చేశాడని మంచు మనోజ్ డయల్​100 కు ఫోన్ చేసి చెప్పారు. పహాడీ షరీఫ్ పోలీసులు జల్ పల్లి లోని మోహన్ బాబు ఇంటికి వెళ్లి విచారణ జరిపారు.

Also Read :- 2024@ సత్తా చాటిన సౌత్ సినిమా

తమ కుటుబంలో విబేధాలు ఉన్నాయని, వాటిని తామే పరిష్కరించుకుంటామని మోహన్​బాబు చెప్పడంతో వెళ్లిపోయారు. కాగా, సాయంత్రం మనోజ్​బంజారాహిల్స్​రోడ్డు నంబరు 12లోని టీఎక్స్​ దవాఖానకు తన భార్య మౌనికతో కలిసి వచ్చాడు. మనోజ్​మెడ, కాళ్లకు గాయాలయ్యాయని, వాపు వచ్చిందని ట్రీట్మెంట్​చేసిన డాక్టర్లు చెప్పారు. మెడ తిప్పలేకపోతున్నాడని చెప్పారు.

సీటీ స్కాన్, అల్ట్రా సౌండ్​తో పాటు ఎక్స్​రే తీశారు. పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. 24  గంటలు పాటు అబ్వర్వేషన్ లో ఉండాలని డాక్టర్లు చెప్పగా, సోమవారం మళ్లీ వస్తానని వెళ్లిపోయారని తెలిసింది. దీనిపై మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డిని వివరణ కోరగా 100 డయల్​కు కాల్ వచ్చిందని, పోలీసులు విచారణ జరిపారని, కుటుంబ గొడవ అని చెప్పడంతో ఎలాంటి కేసు నమోదు కాలేదని తెలిపారు.