సర్పంచ్ నవ్య వర్సెస్ ఎమ్మెల్యే రాజయ్య కేసులో బిగ్ ట్విస్ట్

స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే  తాటికొండ రాజయ్య , హన్మకొండ జిల్లా జానకీపురం సర్పంచ్ నవ్య మధ్య ఏర్పడిన వివాదానికి తెరపడింది.  సర్పంచ్  నవ్య చేసిన ఆరోపణల్లో నిజం లేదని పోలీసులు తేల్చారు. ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్‌కు నివేదిక సమర్పించారు. సర్పంచ్ నవ్యకు రెండుసార్లు నోటీసులు ఇచ్చిన  ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు.   

నిర్ణీత సమయానికి ఆధారాలు సమర్పించని నేపథ్యంలో కేసు క్లోజ్ చేయవచ్చని పోలీసులకు  మహిళా కమిషన్‌కు పోలీసులు తెలిపారు.  ఎమ్మెల్యే రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నాడని సర్పంచ్  నవ్య ఆరోపించారు. గ్రామాభివృద్ధికి 25 లక్షల రూపాయలు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని సర్పంచ్ నవ్య ఆరోపించారు. 

ఆ డబ్బును రాబట్టేందుకు ఎమ్మెల్యే రాజయ్య, ఆయన అనుచరులపై భర్త ప్రవీణ్ కుమార్ ఒత్తిడి తెస్తున్నారని, గతంలో తాను చేసిన లైంగిక ఆరోపణలు రాజకీయ లబ్ధి కోసమేనని అగ్రిమెంట్‌పై సంతకాలు చేయిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర మహిళా కమిషన్లు దృష్టి సారించడంతో సర్పంచ్ నవ్య వివాదం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. 

ఈ క్రమంలో సర్పంచ్ నవ్యకు కాజీపేట ఏసీపీ నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యే రాజయ్యపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలను సమర్పి్ంచాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మరోవైపు  నవ్య చేసిన ఆరోపణలను  ఎమ్మెల్యే  తాటికొండ రాజయ్య ఖండించారు.