ఏపీ డిప్యూటీ సీఎంకు భారీ షాక్: షిప్ సీజ్ చేయటం సాధ్యం కాదన్న కలెక్టర్

ఏపీ డిప్యూటీ సీఎంకు భారీ షాక్: షిప్ సీజ్ చేయటం సాధ్యం కాదన్న కలెక్టర్

కాకినాడ పోర్టులో 'సీజ్‌ ద షిప్‌' ఆదేశాలతో నిలిచిపోయిన స్టెల్లా నౌక వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. స్టెల్లా షిప్ సీజ్ చేయడం కుదరదని కాకినాడ కలెక్టర్‌ షాన్‌ మోహన్‌ పరోక్షంగా తేల్చేశారు. తనిఖీలు చేపట్టిన సమయంలో షిప్‍లో 640 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు అంచనా వేసినప్పటికీ, పరీక్షలు చేసిన తరువాత 1,320 టన్నులు రేషన్ బియ్యం ఉన్నట్లు తేలిందని కలెక్టర్ వెల్లడించారు.

"స్టెల్లా ఎల్ పనామా షిప్‌లో12 శాంపిల్స్ సేకరించాం. షిప్‌లో 640 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు మొదట అనుకున్నప్పటికీ, పరీక్షలు చేసిన అనంతరం 1,320 టన్నులు రేషన్ బియ్యం ఉన్నట్లు తేలింది. మొదట ఆ బియ్యాన్ని ఆన్ లోడ్ చేస్తాం. ఏ రైస్ మిల్లు నుంచి ఆ బియ్యం వచ్చాయో తేలాలి. ప్రస్తుతానికి ఆ లోడ్ సత్యం బాలాజీ అనే ఎక్సపర్టర్స్‌కి చెందినదిగా గుర్తించాం. వాళ్లు బియ్యం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు..? ఎక్కడ నిల్వ చేశారనే దానిపై దర్యాప్తు జరుగుతోంది..?" అని  కాకినాడ కలెక్టర్‌ వెల్లడించారు. 

Also Read :- మూతపడనున్న సంధ్య 70MM థియేటర్ ? పోలీసుల షోకాజ్ నోటీసుల్లో ఏముందంటే..!

కలెక్టర్ మాటలను బట్టి స్టెల్లా నౌకలో పట్టుకున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని షిప్ ను వదిలేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలకు నూక బియ్యం ఎగుమతులు ఆగిపోవడంపై కేంద్ర ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.