
విశాఖ అర్కె బీచ్ లో శవమై తేలిన శ్వేత కేసులో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. శ్వేత భర్త మణికంఠ చెల్లెలి భర్త సత్యంపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. శ్వేత తల్లి రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సత్యంపై కేసు నమోదు చేశారు. శ్వేతకు అన్న వరుస అయ్యే సత్యంపై లైంగిక ఆరోపణలు రావడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
శ్వేత అత్తమామలతో పాటుగా భర్త మణికంఠ, సత్యం వేధించినట్లుగా రమాదేవి తన ఫిర్యాదులో తెలిపారు. వివాహం అయినప్పటి నుంచి శ్వేత వేధింపులు మొదలయ్యాయని రమాదేవి వెల్లడించారు. సత్యం లైంగిక వేధింపుల గురించి తన భర్త మణికంఠకు చెప్పిన అతరను పట్టించుకోలేదని రమాదేవి వాపోయింది. తప్పు చేసింది సత్యమే అయిన శ్వేతతోనే క్షమాపణలు చెప్పించారని తెలిపారు.
శ్వేత పేరు మీద ఉన్న స్థలాన్ని తమ పేరు మీద రాయాలని భర్తత, అత్తమామలు ఒత్తడి చేశారని రమాదేవి ఆరోపించారు. తన కూతుర్ని భర్తతో ఉండనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శ్వేత మృతదేహానికి కేజీహెచ్ లో పోస్టుమార్టం జరిగింది. ప్రాధమిక నివేదికను పోలీసులకు అందజేశారు. ప్రస్తుతం శ్వేతది అత్మహత్యగా భావించినప్పటికీ అనుమానస్పద మృతిగా కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.