నేషనల్​హెరాల్డ్​కేసులో బిగ్ ట్విస్ట్.. రూ.661 కోట్ల ఆస్తుల స్వాధీనానికి ఈడీ నోటీసులు

నేషనల్​హెరాల్డ్​కేసులో బిగ్ ట్విస్ట్.. రూ.661 కోట్ల ఆస్తుల స్వాధీనానికి ఈడీ నోటీసులు

న్యూఢిల్లీ: నేషనల్​హెరాల్డ్​పత్రిక, ది అసోసియేటెడ్​ జర్నల్స్​లిమిటెడ్​(ఏజేఎల్​)కు సంబంధించిన మనీ లాండరింగ్​కేసులో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా రూ.661 కోట్ల విలువచేసే స్థిరాస్తుల జప్తునకు నోటీసులు జారీ చేసినట్టు ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)  తెలిపింది. ఆ ఆస్తులు ఉన్న సంబంధిత రిజిస్ట్రార్​కు నోటీసులను అందజేసినట్టు తెలిపింది.

 అలాగే, ఢిల్లీ ఐటీవోలోని హెరాల్డ్ హౌస్‌‌‌‌‌‌‌‌, ముంబైలోని బాంద్రా(ఈ) ప్రాంతంలో (ప్లాట్ నంబర్ 2, సర్వే నంబర్ 341), లక్నో బిశేశ్వర్ నాథ్ రోడ్ (ఆస్తి నంబర్ 1) వద్ద ఉన్న ఏజేఎల్​ భవనంలో  నోటీసులు అతికించినట్టు వెల్లడించింది. ఢిల్లీ, లక్నో  ప్రాంగణాలను ఖాళీ చేయాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నది. ముంబైలోని నేషనల్​హెరాల్డ్​హౌస్​బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ వరకూ ఒక ఆప్షన్‌‌‌‌‌‌‌‌గా దాని అద్దెను ఈడీకి ట్రాన్స్​ఫర్​ చేసే వెసులుబాటు కల్పించింది. పీఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ 8, రూల్ 5(1) కింద ఈడీ ఈ చర్యలు తీసుకుంది. 2023 నవంబర్‌‌‌‌‌‌‌‌లో ఈడీ ఈ ఆస్తులను జప్తు చేయడంతోపాటు 90.2 కోట్ల షేర్స్​ను అటాచ్​ చేసింది. 

ఏంటీ నేషనల్​ హెరాల్డ్​ కేసు..?

ఏజేఎల్, దాని యాజమాన్య కంపెనీ యంగ్ ఇండియన్​ కంపెనీపై మనీ లాండరింగ్ కేసు ఇది. నేషనల్ హెరాల్డ్ కేసుగా ప్రచారంలో ఉంది. నేషనల్ హెరాల్డ్ పత్రికకు పబ్లిషర్స్‌‌‌‌‌‌‌‌గా ఏజేఎల్ ఉండగా, యంగ్ ఇండియన్‏లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి 38 శాతం చొప్పున మెజారిటీ షేర్లు ఉన్నాయి. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు ఏజేఎల్ బకాయి పడిన రూ.90 కోట్లను వసూలు చేసుకునే విషయంలో యంగ్ ఇండియన్​లో ఆర్థిక అవకతవకలు జరిగాయని ఈడీ ఆరోపిస్తున్నది.