సింగర్ కల్పన కేసులో బిగ్ ట్విస్ట్.. పెద్ద కూతురితో గొడవ.. భర్త ఫోన్ చేసినా నో రెస్పాన్స్..!

సింగర్ కల్పన కేసులో బిగ్ ట్విస్ట్.. పెద్ద కూతురితో గొడవ.. భర్త ఫోన్ చేసినా నో రెస్పాన్స్..!

హైదరాబాద్: సింగర్ కల్పన కేసులో హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. Zolfresh అనే నిద్ర మాత్రలను ఎక్కువగా తీసుకుని కల్పన ఈ పరిస్థితి తెచ్చుకున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కల్పన స్పృహలోకి రాగానే ఆమె వాంగ్మూలాన్ని రికార్డ్ చేయాలని కేపీహెచ్బీ పోలీసులు నిర్ణయించారు. హైదరాబాద్లో సింగింగ్తో పాటు కల్పన ‘లా’ కూడా చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. 

కేరళలో ఉంటున్న తన పెద్ద కూతురుని హైదరాబాద్కు రావాలని కల్పన కోరింది. ‘హైదరాబాద్కు రాను.. కేరళలోనే ఉంటాను’ అని ఆమె కూతురు తెగేసి చెప్పినట్లు సమాచారం. దీంతో.. ఈ విషయంలోనే నిన్న (మంగళవారం, మార్చి 4, 2025) ఇద్దరి మధ్య ఫోన్లో.. తల్లీకూతురి మధ్య వాగ్వాదం జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

Also Read:-సింగర్ కల్పన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్: ఆమె భర్త ఎవరు ? ఏం చేస్తుంటారు ?

మంగళవారం(మార్చి 4, 2025) మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కల్పన ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. రోజూ వేసుకునే నిద్ర మాత్రలను ఎక్కువ మోతాదులో కల్పన తీసుకుందని వైద్యులు వెల్లడించారు. సాయంత్రం 4:30 గంటలకు కల్పనకు ఆమె భర్త ప్రసాద్ ఫోన్ చేశారు.

కల్పన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆమె నివాసం ఉంటున్న విల్లా సెక్రటరీకి ప్రసాద్ కాల్ చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇంట్లోకి వెళ్లి బెడ్ రూంలో అపస్మారక స్థితిలో పడి ఉన్న కల్పనను పోలీసులు హాస్పిటల్కు తరలించారు. నిజాంపేట రోడ్లోని విల్లాలో ఆమె నివాసం ఉంటుంది. కల్పనకు రోజూ నిద్రమాత్రలు వాడే అలవాటు ఉందని ఆమె భర్త ప్రభాకర్ పోలీసులకు తెలిపారు.