సీఎం కాళ్లు కడిగింది.. మూత్రం బాధితుడివి కాదా!

కొద్దిరోజుల క్రితం మధ్యప్రదేశ్‌లో దళితుడిపై మూత్రం పోసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. ఓ రాజకీయ నేత ముఖ్య అనుచరుడడైన ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి.. ఓ అమాయక గిరిజన యువకుడిపై మూత్రవిసర్జనకు పాల్పడి పైశాచిక ఆనందాన్ని పొందారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. వెంటనే అప్రమత్తమైన శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వం బాధితుడికి క్షమాపణ చెప్పడమే కాకుండా కాళ్లు కడిగి నెత్తిన చల్లుకున్నారు. 

ALSO READ :అవసరమైతే సీతక్కను సీఎం చేస్తాం:రేవంత్ రెడ్డి

అనంతరం ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని అరెస్టు చేయడమే కాకూండా అతడి ఇంటిని బుల్డోజర్‌తో కూల్చేశారు. అయితే ఈ ఘటనలో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ కాళ్లు కడిగింది.. మూత్ర విసర్జన ఎదుర్కొన్న బాధితుడివి కాదట. ఈ విషయాన్ని కాళ్లు కడిగించుకున్న వ్యక్తే స్వయంగా వెల్లడించారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

ముఖ్యమంత్రి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలా కనపడ్డ వారి కాళ్లు కడిగారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ విషయం వెలుగులోకి వచ్చాక ముఖ్యమంత్రి కాళ్లు కడిగింది.. బాధితుడివి కాదా! అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు మూత్ర విసర్జన ఎదుర్కొన్న బాధితుడికి.. కాళ్లు కడిగించుకున్న వ్యక్తికి వయస్సులో కూడా చాలా తేడా ఉందని నెటిజన్స్ చెప్తున్నారు. వారి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.