రేప్ చేయటానికి ప్రయత్నించాడు.. కుదరకపోవటంతో చంపేశాడు..

ముంబైలో తన ప్లాట్ లో హత్యకు గురైన  ఎయిర్ హోస్టెస్‌ రూపా ఓగ్రే హత్య కేసు వీడింది. ఆమె ఫ్లాట్‌లో హౌజ్‌కీపింగ్ చేసే వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు గుర్తించారు. నిందితుడు విక్రవ్ అట్వాల్‌(40)ను కోర్టులో హాజరుపరిచారు.  విచారణలో నిందితుడు బాధితురాలిపై అత్యాచారం చేయాలనుకున్నానని కానీ ఆమె ప్రతిఘటించడంతో చంపేసినట్లుగా ఒప్పుకున్నాడు. 

రూపా ఫ్లాట్‌లో విక్రమ్ అట్వాల్ క్లీనింగ్ పనులు చేస్తుంటాడు. అయితే తన ఫ్లాట్‌లో విధులు సరిగా నిర్వహించట్లేదని రూపా అతనిని ఇటీవల మందలించింది. ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్న విక్రమ్.. పక్కా ప్లాన్ చేసుకుని పదునైన ఆయుధంతో రూపా ఫ్లాట్‌కు వెళ్లాడు. ముందుగా ఆమెపై  అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. కానీ రూపా విక్రమ్‌ని నెట్టివేసి బయటకు పరుగులు పెట్టే ప్రయత్నం చేసింది. 

అయితే విషయం ఎక్కడ బయటపడుతుందో అని విక్రమ్ అట్వాల్ ఆమె మెడను పదునైన ఆయుధంతో కోశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.  దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది.  రూపా హత్య కేసులో బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేపట్టిన పోలీసులు దాదాపు 45మందిని విచారించారు.  ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రూపా..  ఎయిర్ ఇండియాలో శిక్షణ కోసం ఏప్రిల్‌లో ముంబైకి వచ్చింది.   రూపల్ చివరిసారిగా ఆదివారం ఉదయం తన కుటుంబంతో వాట్సాప్ వీడియో కాల్‌లో మాట్లాడింది.