DSC స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు బిగ్ అప్డేట్.. సర్టిఫికేట్ రీ వెరిఫికేషన్ తేదీ ప్రకటించిన విద్యాశాఖ

హైదరాబాద్: డీఎస్సీ-2024 స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు విద్యాశాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది. స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల సర్టిఫికెట్ల రీ వెరిఫికేషన్ తేదీలను అనౌన్స్ చేసింది. జిల్లాల వారీగా అభ్యర్థులకు విద్యాశాఖ తేదీలను ప్రకటించింది. 2024 నవంబర్ 20వ తేదీ నుండి.. 2024, నవంబర్ 22వ తేదీ వరకు సర్టిఫికేట్ రీ వెరిఫికేషన్ చేయనున్నట్లు తెలిపింది. హైదరాబాద్‎లోని దోమలగూడ ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో సర్టిఫికేట్ రీ వెరిఫికేషన్ ప్రాసెస్ జరగనుంది.

ప్రతి రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల ధృవ పత్రాల పరిశీలన జరుగుతోందని తెలిపింది. సర్టిఫికేట్ రీ వెరిఫికేషన్‎కు హాజరయ్యే అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకురావాలని ఆదేశించింది. ఏదైనా సమస్యలు ఉంటే సంబంధింత అధికారులను సంప్రదించాలని విద్యాశాఖ అభ్యర్థులకు సూచించింది. 

కాగా, కొందరు అభ్యర్థులు తప్పుడు స్పోర్ట్స్ సర్టిఫికేట్లు సమర్పించారని విద్యాశాఖకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. దీంతో సోర్ట్స్ కోటాలో సెలెక్ట్ అయిన మొత్తం 393 మంది అభ్యర్థుల సర్టిఫికేట్లను పున పరిశీలన చేయాలని విద్యాశాఖ డిసైడ్ అయ్యింది. ఇందులో భాగంగానే అభ్యర్థులకు సర్టిఫికేట్ రీ వెరిఫికేషన్ తేదీలను ప్రకటించింది. 

కాగా, తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి విద్యాశాఖ నిర్వహించిన డీఎస్సీ-2024 ఫలితాలు సెప్టెంబరు 30న విడుదల అయ్యాయి. డీఎస్సీకి సెలక్ట్ అయిన అభ్యర్థులకు 2024, అక్టోబరు 1 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు సర్టిఫికేషన్ జరిగిన విషయం తెలిసిందే. డీఎస్సీకి ఎంపికైన టీచర్లకు సీఎం రేవంత్ రెడ్డి 2024, అక్టోబర్ 9వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేశారు.