హైదరాబాద్ మీర్ పేట్లో భర్త చేతిలో అతి దారుణంగా హత్యకు గురైన మాధవీ కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. గురుమూర్తి తన భార్య మాధవీపై అనుమానంతో ఆమెను దారుణంగా హత్య చేసి శరీర భాగాలను ఉడకబెట్టి ఆ తర్వాత పొడిగా మార్చి చెరువులో పడేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన క్లూస్ టీమ్.. శుక్రవారం (జనవరి 24) సుమారు మూడు గంటల పాటు గురుమూర్తి ఇంట్లో సోదాలు నిర్వహించింది.
ఈ సందర్భంగా గుర్తుమూర్తి ఇంట్లో శరీర అవయవాలు కాల్చిన ఆనవాళ్ళను పోలీసులు సేకరించారు.ఆ కాల్చిన ఆనవాళ్ళలో డీఎన్ఏ సేకరించిన పోలీసులు.. ఆ డీఎన్ఏతో గురుమూర్తి పిల్లల డీఎన్ఏ టెస్ట్ చేయాలని నిర్ణయించారు పోలీసులు. గురుమూర్తి ఇంట్లో దొరికన డీఎన్ఏతో పిల్లల డీఎన్ఏ మ్యాచ్ అయితే పోలీసులు ఈ కేసులో కీలక పురోగతి సాధించినట్లే. గురుమూర్తి హత్య చేయడానికి ఉపయోగించిన పలు వస్తువులను కూడా పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు.
ALSO READ | అనంతపురం: నేషనల్ హైవేకు దగ్గరగా భారీ చోరీ.. రూ. 4 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు.. నగదు దోపిడి
అలాగే.. గురుమూర్తి ఇంట్లో ఇన్ఫ్రారెడ్ ద్వారా పోలీసులు రక్తపు మరకలు గుర్తించారు. గురుమూర్తి పిల్లలను కూడా పోలీసులు విచారించారు. సంక్రాంతి పండక్కి ఊరెళ్లి వచ్చిన తర్వాత ఇంట్లో దారుణమైన వాసన వచ్చిందని వారు పోలీసులకు తెలిపారు. అమ్మ ఎక్కడ అని అడిగితే నాన్న మౌనంగా ఉన్నాడని చెప్పారు. ఇదిలా ఉండగా.. కేసు విచారణలో గురుమూర్తి పోలీసులకు చుక్కలు చూపిస్తోన్నట్లు తెలుస్తోంది.
భార్యను చంపిన విధానంపై గురుమూర్తి 2, 3 వెర్షన్స్ చెబుతుండటంతో పొంతన లేని సమాధానాలతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తుందని భావించి భార్యను గురుమూర్తి చంపినట్లుగా దర్యాప్తులో ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. హత్య అనంతరం ఇంట్లోని బాత్ రూమ్‌లోనే మాధవి మృతదేహాన్ని కత్తితో ముక్కలు ముక్కలు చేసి.. ఇంట్లో రక్తపు మరకలు కనిపించకుండా గురుమూర్తి 10 సార్లు కడిగిననట్లు పోలీసులు గుర్తించారు.