SLBC రెస్క్యూ అపరేషన్‎లో బిగ్ అప్డేట్: టన్నెల్ నుంచి డెడ్ బాడీ వెలికితీత

SLBC రెస్క్యూ అపరేషన్‎లో బిగ్ అప్డేట్: టన్నెల్ నుంచి డెడ్ బాడీ వెలికితీత

హైదరాబాద్: ఎస్ఎల్‎బీసీ టన్నెల్ రెస్య్కూ ఆపరేషన్‎లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సహయక చర్యలు మొదలైన 16వ రోజు ఎట్టకేలకు టన్నెల్‎ నుంచి ఓ కార్మికుడి మృతదేహాన్ని రెస్క్యూ బృందాలు వెలికితీశాయి. టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం) ముందు భాగంలో డెడ్ బాడీని గుర్తించిన రెస్క్యూ సిబ్బంది.. శిథిలాలను తొలగించి మృతదేహాన్ని బయటకు తీశాయి. ప్రమాద స్థలం నుంచి లోకో ద్వారా డెడ్ బాడీని టన్నెల్ బయటకు తీసుకొచ్చారు. 

మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం అనంతరం డెడ్ బాడీని మృతుడి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. బయటపడిన డెడ్ బాడీ టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్‎గా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  మరోవైపు.. టన్నెల్‎లో చిక్కుకుపోయిన మిగితా కార్మికుల కోసం సహయక బృందాలు గాలిస్తున్నాయి. టన్నెల్ లోపల క్యాడవర్ డాగ్స్‎తో పాటు 157 మంది కార్మికులు, సాంకేతిక నిపుణులు రెస్య్కూ ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నారు.  

ALSO READ | తప్పేంటో చూపించమంటే తోక ముడిచారు.. BRS, బీజేపీ సీఎం రేవంత్ ఫైర్

కాగా,  నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ దగ్గర 2025,  ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రిటైనింగ్ వాల్ కడుతుండగా 14వ కిలో మీటర్ వద్ద 3 మీటర్ల మేర పైకప్పు కుంగిపోయింది.. రిటైనింగ్ వాల్ కూలి టన్నెల్‌లో రింగులు విరిగిపడడంతో.. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఈ ఘటనలో 8 మంది కార్మికులు టన్నెల్లో చిక్కుకుపోయారు. 

వెంటనే అప్రమత్తమైన అధికారులు టన్నెల్‎లో చిక్కుకుపోయిన కార్మికులను కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. టన్నెల్‎లో భారీగా బురద, నీరు ఉబకడంతో పాటు ధ్వంసమైన టన్నెల్ బోరింగ్ మిషన్ పరికరాలు రెస్య్కూ ఆపరేషన్ ఛాలెంజింగ్‎గా మారాయి. అయినప్పటికీ సహయక బృందాలు తీవ్రంగా కృషి చేసి ఘటన స్థలం వద్దకు చేరుకున్నాయి. టన్నెల్ వద్ద 16 రోజులుగా సహయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఎట్టకేలకు 16వ రోజు ఓ కార్మికుడి డెడ్ బాడీని వెలికితీశాయి.