BIGBEN Cinemas Amma: ఆర్జే శ్వేత దర్శకత్వంలో అమ్మ మూవీ..ఎమోషనల్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వస్తున్న పెళ్లి చూపులు మేకర్స్

BIGBEN Cinemas Amma: ఆర్జే శ్వేత దర్శకత్వంలో అమ్మ మూవీ..ఎమోషనల్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వస్తున్న పెళ్లి చూపులు మేకర్స్

విజయ్ దేవరకొండ మేనమామ,నిర్మాత యష్ రంగినేని పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్, దొరసాని, అన్నపూర్ణ ఫొటో స్టూడియో, ABCD, భాగ్ సాలే వంటి విభిన్నమైన సినిమాలను నిర్మించిన బిగ్ బెన్ సినిమాస్ సంస్థ నుంచి మరో ఇంట్రెస్టింగ్ మూవీ రాబోతున్నట్లు మదర్స్ డే సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేస్తూ వివరాలను ప్రకటించారు. 

బిగ్ బెన్ సినిమాస్ (BIGBEN Cinemas)సంస్థ తమ ప్రొడక్షన్ నెం.7గా 'అమ్మ'(Amma) అనే టైటిల్ తో వస్తున్నట్లు అనౌన్స్ చేశారు. "మా ప్రొడక్షన్ హౌస్ నెక్స్ట్ ఫిల్మ్ అమ్మ. మదర్స్ డే సందర్బంగా కాన్సెప్ట్ పోస్టర్‌ను ఆవిష్కరించడానికి మేము సంతోషిస్తున్నాము. ప్రపంచంలోని తల్లులందరికీ మరియు  వారి త్యాగాలకు అంకితం చేయబడిన ఈ ఎమోషనల్ థ్రిల్లర్ త్వరలో మీ ముందుకు రాబోతుంది"..ఈ సినిమాతో ఆర్జే శ్వేత పీవీఎస్(RJ Swetha PVS) దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు" అని బిగ్ బెన్ సినిమాస్ పోస్ట్ చేశారు. 

అమ్మ అనే అనిర్వచనీయమైన టైటిల్ తోనే అట్ట్రాక్ట్ చేయగా..పోస్టర్ తో మరింత ఇంట్రెస్టింగ్ కలుగజేశారు. ఈ పోస్టర్ ని గమనిస్తే..అమ్మ ఫొటో బ్యాక్ డ్రాప్ లో అగ్ని జ్వాలల మధ్య పంజరం, పక్షి ఫొటోతో డిజైన్ చేసిన విధానం బాగుంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ ప్రకటించనున్నారు.

BIGBEN Cinemas :

అలాగే ఈ బిగ్ బెన్ సినిమాస్ సంస్థ..ఇప్పటివరకు 6 గురు కొత్త డైరెక్టర్స్ ని పరిచయం చేసింది. అందులో 1. తరుణ్ భాస్కర్-పెళ్లి చూపులు- 2, డియర్ కామ్రేడ్- భరత్ కమ్మ, 3. KVR మహేంద్ర-దొరసాని, 4. సంజీవ్ రెడ్డి-ABCD, 5. ప్రణీత్-భాగ్ సాలే, 6. చెందు ముద్దు- అన్నపూర్ణ ఫొటో స్టూడియో.ఇక ఈ సంస్థ నుంచి  డైరెక్టర్ గా ఆర్జే శ్వేత ఫస్ట్ ఫిమేల్ అవ్వడం విశేషం.