పునర్నవి భూపాలం..సినిమాలతో వచ్చిన క్రేజ్ కంటే ఈ అమ్మడికి బిగ్ బాస్ తో వచ్చిన క్రేజ్ ఎక్కువ. బిగ్ బాస్ లో బోల్డ్ కామెంట్స్ తో తెగ హడావుడి చేసేది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో లవ్ అంటూ కూడా బాగా ప్రచారం కూడా జరిగింది. బిగ్ బాస్ షోతో క్రేజ్ వచ్చిన తర్వాత కూడా పునర్నవి ఎటువంటి సినిమాల్లో నటించడం లేదు. లండన్ లో సైకలాజీలో హయ్యర్ స్టడీస్ చేస్తూ బిజీగా ఉంది. కానీ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంది. అయితే న్యూ ఇయర్ సందర్భంగా పునర్నవి తన అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్ చెప్పింది. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని ఇన్ స్టాగ్రమ్ స్టోరీ పోస్ట్ షేర్ చేసి షాక్ కు గురిచేసింది.
‘నేను కొత్త సంవత్సరం ఊపిరితిత్తుల సమస్యతో ప్రారంభిస్తున్నా. చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడటం ఇదే మొదటి సారి. ఇదే చివరిసారి కావాలని ఆశిస్తున్నా. ఇప్పటికీ అనారోగ్యంగానే ఉన్నా’ అంటూ పోస్ట్ చేసింది. పునర్నవి అనారోగ్యానికి గురైందని తెలిసిన ఆమె అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే..