కాంగ్రెస్ లో చేరిన బిగ్ బాస్ ఫేం నూతన్ నాయుడు

ఏపీ కాంగ్రెస్ పార్టీకి సినీ, సెలబ్రిటీ కలర్ వచ్చింది. బిగ్ బాస్ ఫేం నూతన్ నాయుడు ఆ పార్టీలో చేరారు. 2024, ఆగస్ట్ 3వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో.. పార్టీ కండువా కప్పుకున్నారు నూతన్ నాయుడు. ఏపీ కాంగ్రెస్ పార్టీలో పదేళ్ల తర్వాత ఓ సినీ సెలబ్రిటీ పార్టీలో చేరటం ఇదే కావటం విశేషం. 

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. వైఎస్ షర్మిల దూకుడుగా ఉన్నారు. పార్టీని ముందుకు నడిపించటంలో వేగంగా అడుగులు వేస్తున్నారు. గత ఎన్నికల్లో తన ప్రచారంతో అన్నయ్య జగన్ ను ఓడించటంలోనూ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు పార్టీని బలోపేతం చేయటంలోనూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే బిగ్ బాస్ ఫేం నూతన్ నాయుడు ఆ పార్టీలో చేరటం విశేషం.

ఇక నూతన్ నాయుడికి పార్టీలో ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారు అనేది ఆసక్తిగా మారింది.