బిగ్బాస్ సీజన్ 8 (Bigg Boss Telugu 8) చివరిదశకు చేరింది. పదమూడో వారంలో టేస్టీ తేజ, కన్నడ బ్యాచ్ పృథ్వీరాజ్ శెట్టి (Prithvi Raj Shetty) ఇద్దరూ ఎలిమినేట్ అయి హౌజ్నుంచి వెళ్లిపోయారు. అయితే, తమ ఆటతో చివరివరకు వచ్చి ఆఖరిలో హౌస్ నుంచి వెళ్ళిపోయినా ఈ కంటెస్టెంట్స్ ఎంత సంపాదించారు? వారానికి ఎంత తీసుకున్నారు అనేది చూద్దాం.
ALSO READ | పెళ్లైన ఏడాదికే నటి శోభిత ఎందుకు ఆత్మహత్య చేసుకుంది..? ఆమె భర్త సుధీర్ రెడ్డి ఎవరు..?
మాజీ కంటెస్టెంట్ టేస్టీ తేజ అక్టోబరు 6న వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. శనివారం నవంబర్ 30 జరిగిన ఎపిసోడ్లో తేజ ఎలిమినేట్ అయ్యారు. అయితే టేస్టీ తేజ హౌస్ లో ఉన్న హౌసులో 8 వారాలకు గానూ.. వారానికి రూ. 1.5 లక్షల రెమ్యునరేషన్ చొప్పున మొత్తం రూ. 12 లక్షలు అందుకున్నట్లు సమాచారం. దీన్నీ బట్టి టేస్టీ తేజ బాగానే సంపాదించాడని తెలుస్తోంది.
💥 Tasty Teja’s incredible journey in the Bigg Boss house comes to a close, but his bold gameplay and strategic moves will be remembered forever! 🙌 #BiggBossTelugu8 #StarMaa @DisneyPlusHSTel pic.twitter.com/QKb4AgK3jf
— Starmaa (@StarMaa) December 1, 2024
ఇక కన్నడ బ్యాచ్ కి చెందిన పృథ్వీరాజ్ శెట్టి ఆదివారం నాటి ఎపిసోడ్లో ఎలిమినేట్ అయ్యాడు. హౌస్ లో 91 (అంటే 13 వారాలు) రోజులున్న పృథ్వీరాజ్.. రోజుకు రూ. 18,572 రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. అంటే, వారానికి రూ. 1లక్ష 30 వేలు అన్నమాట. ఈ లెక్కన చూస్తే.. 13 వారాలకు గాను పృథ్వీరాజ్ రూ.16 లక్షల 90 వేలు సంపాదించినట్లు టాక్. అయితే, 13 వారాలకు గాను పృథ్వీరాజ్ శెట్టి రూ.19 లక్షల 50 వేలు తీసుకున్నట్లు కూడా మరో టాక్ వినిపిస్తోంది. మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది.