BiggBoss18Finale: హిందీ బిగ్బాస్ 18 ఫైనల్ విజేత ఇతనే.. ప్రైజ్ మనీ ఎంత గెల్చుకున్నాడంటే?

BiggBoss18Finale: హిందీ బిగ్బాస్ 18 ఫైనల్ విజేత ఇతనే.. ప్రైజ్ మనీ ఎంత గెల్చుకున్నాడంటే?

ఇండియా పాపులర్ రియాలిటీ గేమ్ షోస్లో.. బిగ్ బాస్ ప్రేక్షకులను మరింత ఎక్కువగా అలరిస్తోంది. ఈ గేమ్ షోని తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ తదితర భాషలలో కూడా నిర్వహిస్తున్నారు. ఇటీవలే తెలుగు బిగ్ బాస్.. 8 సీజన్లు సక్సెస్ ఫుల్గా కంప్లీట్ చేసుకుంది.

ఇపుడు హిందీలో బిగ్ బాస్ షో 18 (Bigg Boss 18) సీజన్లు పూర్తీ చేసుకుని తాజాగా (జనవరి 19న) విన్నర్ని ప్రకటించారు. బాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో 18 విన్నర్ ఎవరు? రన్నర్ ఎవరు? వారికి వచ్చిన ప్రైజ్ మనీ ఎంతనే వివరాలు చూద్దాం.

హిందీ బిగ్ బాస్ 18 విజేతను జనవరి 19న ప్రకటించారు. బిగ్ బాస్ 18వ సీజన్‌ విజేతగా కరణ్ వీర్ మెహ్రా (Karan Veer Mehr) నిలిచారు. ఆడియెన్స్ ఓట్ల ఆధారంగా కరణ్ వీర్ మెహ్రా విజేతగా ప్రకటించారు. 46 ఏళ్ల కరణ్ వీర్ మెహ్రా ఈ షో ద్వారా రూ. 50 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. మొదటి రన్నరప్‌గా వివియన్ ద్సేనా (Vivian Dsena) ఉండగా, రెండవ రన్నరప్‌గా యూట్యూబర్ రజత్ దలాల్ నిలిచారు.

బిగ్ బాస్ 17 విజేత కమెడియన్ మునవర్ ఫరూఖ్ తర్వాత కరణవీర్ మెహ్రా రియాల్టీ షో విజేతగా నిలిచాడు. బిగ్ బాస్ షోకు ముందు కరణ్ పవిత్ర రిష్తా, యే రిష్తా క్యా కెహ్లతా హై, పరి హూన్ మైన్, బడే అచ్ఛే లాగ్తే హాన్, ససురల్ సిమర్ కా, పోలీస్ & క్రైమ్, వంటి టీవీ షోలతో బాగానే పాపులర్ అయ్యాడు. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ లోకి అడుగు పెట్టాడు. బిగ్ బాస్ 17 విజేత కూడా రూ.50 లక్షల ప్రైజ్ మనీ తీసుకున్నాడు. ఇకపోతే, సీజన్‌18 అక్టోబర్ 4, 2024న ప్రసారమైంది.105 రోజుల పాటు ఇంట్రెస్టింగ్గా సాగింది. 

గతంలో బిగ్ బాస్ విజేతలు ఎంత తీసుకున్నారంటే:

సీజన్ 17- మునావర్ ఫరూకీ- రూ.50 లక్షలు

సీజన్ 16- MC స్టాలిన్ - రూ.31.8 లక్షలు

సీజన్ 15- తేజస్వి ప్రకాష్- రూ.40 లక్షలు

సీజన్ 14- రుబీనా దిలైక్- రూ.36 లక్షలు

సీజన్ 13- సిద్ధార్థ్ శుక్లా- రూ.50 లక్షలు

సీజన్ 12- దీపికా కక్కర్- రూ.30 లక్షలు తీసుకున్నారు.