బిగ్బాస్ 7 ఫేమ్ పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) టైటిల్ గెలిచినా తర్వాత..రోడ్ షోలో జరిగిన అల్లర్లు,ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం..దీంతో ప్రశాంత్ అరెస్ట్..ఆ వెంటనే బెయిల్..ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ఇందుకు ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కి వచ్చి సైన్ పెట్టి వెళ్లాలని..అలాగే పలు కండీషన్స్తో కూడిన బెయిల్ తో ప్రశాంత్ కి వచ్చిన బెయిల్తో కాస్త రిలాక్స్ అయ్యాడు.
ఇదంతా పక్కనబెడితే..రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అతను బిగ్ బాస్ హౌస్ నుంచి తనపై కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ చేసిన తప్పుడు ప్రచారం చేసిన వారిపై రివేంజ్ తీర్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా..చంచల్ గూడా జైల్లో పెట్టారు. నాలుగు రోజుల తర్వాత ఇతడికి బెయిల్ మంజూరు కావడంతో తిరిగి తన ఊరికి వెళ్లిపోయాడు ప్రశాంత్.
బిగ్‌బాస్ ఫినాలే అయిపోయిన తర్వాత ప్రశాంత్ ఇంటర్వ్యూ కోసం..కొంతమంది ప్రయత్నించగా, తన ఊరికొస్తే మాత్రమే ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పినట్లు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలా కొంతమంది తన ఇంటర్వ్యూ కొరకు ప్రశాంత్ ఊరికి వెళ్లగా..చాలాసేపు వెయిట్ చేయించి..వెళ్లిపోమన్నాడని కొందరు ఇన్ స్టాలో స్టోరీలు పెట్టారు. అయితే తాను అలసిపోవడం వల్లే ఇంటర్వ్యూలు యూట్యూబర్స్కి ఇవ్వలేకపోయినని ప్రశాంత్ తీరిగ్గా వీడియో పోస్ట్ చేశాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరగడం వల్ల ప్రశాంత్ హార్ట్ అయినట్లు న్యూస్ వినిపిస్తోంది. ఇక అందుకు సంబందించిన విషయాలపైనా పరువు నష్టం దావా వేయడానికి..ఇప్పటికే తన తరుపు లాయర్లతో చర్చించినట్లు సమాచారం.
ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏదేమైనా ప్రస్తుతం పలు కండిషన్లతో బెయిల్ మీద బయటికి వచ్చాడు కనుక..ఇప్పుడే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవొద్దంటూ ప్రశాంత్ ఫ్యాన్స్..పలువురు క్రిటిక్స్ నుంచి వినిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో అని బిగ్బాస్ ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు.