బిగ్ బాస్ సీజన్ (Bigg Boss 8 Telugu) లో 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వారిలో ఒక్కో వారం చొప్పున ఒకరు నుండి ఇద్దరు ఎలిమినేట్ అవుతూ వచ్చారు. ఇప్పుడిక హౌజ్ లో కేవలం ఐదుగురు మాత్రమే మిగిలారు. వారిలో నిఖిల్, ప్రేరణ, అవినాష్, నబీల్ అఫ్రిది, గౌతం కృష్ణ ఉన్నారు.
ఇప్పటికే పద్నాలుగు ఎపిసోడ్స్ దుమ్ముదులిపేశాయ్. ఇప్పుడు పదిహేనో వారం కూడా రసవత్తరంగా సాగుతోంది. డిసెంబర్ 15 గ్రాండ్ ఫినాలే జరగనుంది. టైటిల్ గెలవడానికి అభిమానులు తమ అభిమాన కంటెస్టెంట్‌లకు హుషారుగా ఓటు వేస్తున్నారు. మరి ఏ కంటెస్టెంట్ కి ఎలాంటి మద్దతు లభిస్తోంది? చివర్లో ఆడియన్స్ ఏమైనా సింపతీ చూపిస్తున్నారా? లేదా ఆట తీరును బట్టే ఓట్లు వేస్తున్నారా? అనేది చూద్దాం.
ప్రస్తుతం టాప్2 కంటెస్టెంట్స్ ఎవరనేది చూస్తే.. అందులో నిఖిల్ మరియు గౌతమ్ కృష్ణ ఉన్నారు. ఈ ఇద్దరి మధ్యే యుద్ధం సాగనుంది. ఇప్పుడు జరుగుతున్న ఓటింగ్ ట్రెండ్‌లు మరియు ప్రేక్షకుల అంతిమ ఎంపికపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఈ వారం ఫస్ట్ డే ఓటింగ్‌లో గౌతమ్ చాలా తక్కువ ఓట్లతో నిఖిల్ కంటే ముందున్నాడు. అయితే, రెండో రోజు ఓటింగ్కి వచ్చేసరికి గౌతమ్‌ను దాటేసి నిఖిల్ ఫస్ట్ ప్లేస్‌కు చేరుకున్నాడు. అయితే, వీరి ఓట్లల్లో కొంచెం తేడా ఉన్నప్పటికీ ఓటింగ్ శాతంలో మాత్రం ఎలాంటి చేంజ్ లేకపోవడం గమనార్హం. అలాగే, మిగతా ఫైనిలిస్ట్‌ల ఓటింగ్ శాతం మాత్రం రోజు రోజుకి తగ్గిపోతు వస్తోంది.
ALSO READ | Bigg Boss: రూ.10 లక్షలతో టెంప్ట్ చేసిన బిగ్ బాస్.. మధ్యలోనే టాప్ కంటెస్టెంట్ సెల్ఫ్ ఎలిమినేషన్!
టాప్ 3లో ఉన్న నబీల్‌కు రెండో రోజు 26,910 ఓట్లు, 19 శాతం ఓటింగ్ నమోదు అయింది. ఇతనికి మొదటి రోజు 21 శాతం ఓటింగ్ ఉండేది. ఇక 10 శాతం ఓటింగ్, 15,238 ఓట్లతో ప్రేరణ టాప్ 4లో నిలిచింది. ఆమెకు ఫస్ట్ డే 11 శాతం ఓటింగ్ నమోదు అయింది. ఇక చివరి స్థానంలో అంటే టాప్ 5లో మొదటి ఫైనలిస్ట్ అవినాష్ ఉన్నాడు. దాంతో అవినాష్ టైటిల్ గెలుచుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అలాగే, అతను మధ్యలోనే సెల్ఫ్ ఎలిమినేషన్ ను తీసుకుని బ్రీఫ్‌కేస్‌ను ఎంచుకోవచ్చని ఇన్నర్ టాక్. గత సీజన్‌లో, బిగ్ బాస్ తెలుగు 7లో ప్రిన్స్ యావర్ రూ.15 లక్షలు అంగీకరించి బయటకు వెళ్లి, అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఇపుడు అవినాష్ మధ్యలోనే వెళుతుండటం అతని ఫ్యాన్స్కి ట్విస్ట్ అనే చెప్పుకోవాలి.
ఆన్ లైన్లో అనధికారికంగా జరుగుతున్న ఓటింగ్:
1.గౌతమ్‌కి (37.41%),
2.నిఖిల్‌కి (37.19%)
3.నబీల్ (11.41%)
4.ప్రేరణ (11.29%)
5.అవినాష్ (2.7%) ఓటింగ్‌తో నిలిచారు.
అయితే.. మొదట్లో చూసిన లిస్టుకి.. ఇక్కడ సోషల్ మీడియా లిస్టుకి కాస్త తేడా ఉంది. దీన్ని బట్టి చూస్తే.. గంటగంటకూ లెక్కలు ఎలా మారిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి.. నిఖిల్, గౌతమ్‌లో విన్నర్ ఎవరనేది మాత్రం.. చివరి క్షణం వరకూ ఉత్కంఠే. ఇక శుక్రవారం రాత్రిలోపు ఓటింగ్ కంప్లీట్ అవుతుంది. దీంతో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనేవి అప్పటివరకు మారుతూనే ఉంటుంది. సోషల్ మీడియాలో ఇపుడు వైరల్ అవుతున్నది అనధికారిక లిస్టు మాత్రమే అని గుర్తించుకోవాలి. వీరిలో ఎవరు విన్నర్ కానున్నారు? బిగ్‌బాస్ ఫైనల్ డెసిషన్ ఏంటీ ? అనేది డిసెంబర్ 15 వస్తే తప్ప క్లారిటీ రాదు.