Bigg Boss Wild Card Entries: బిగ్ బాస్ హౌజ్‌లోకి ఇద్దరు మాజీ కంటెస్టెంట్స్ కన్ఫర్మ్..ప్రేక్షకులకు నవ్వుల వినోదమే ఇక

Bigg Boss Wild Card Entries: బిగ్ బాస్ హౌజ్‌లోకి ఇద్దరు మాజీ కంటెస్టెంట్స్ కన్ఫర్మ్..ప్రేక్షకులకు నవ్వుల వినోదమే ఇక

ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాస్ సీజన్ వాడి వేడిగా జరుగుతోంది. అసలు ఊహించని సంఘనటలు జరుగుతున్నాయి. ఒకరంటే ఒకరు తగ్గకుండా ప్రేక్షుకులకు చిరాకు తెప్పిస్తూ..నోరు వేసుకుని ఇతరులపై పడిపోతున్నారు. దీంతో వీరి ఆటను చూసే ఆడియన్స్ కి ఎలాంటి ఫీలింగ్ కలగట్లేదు..ఒక్క చిరాకు తప్ప. బిగ్ బాస్ పెట్టె టాస్కులు ఆడాలంటే..ఇష్టం వచ్చినట్టు అరవాలా యెట్లా? అనే మాదిరి ఉంది కంటెస్టెంట్స్ పెర్ఫార్మన్స్.  

అయితే.. లేటెస్ట్ ఎపిసోడ్ లో ఎవరు ఎలాంటి ఎత్తులతో తమ ఆట ఆడారో ఒక లుక్కేద్దాం. బిగ్ బాస్ 8 తెలుగు మొత్తం 14 మంది కంటెస్టెంట్లతో షురూ అయింది తెలిసిందే. గడిచిన మూడు వారాల్లో ముగ్గురు కంటెస్టెంట్స్ ఇప్పటికే ఇంటికెళ్లిపోయారు. ఫస్ట్ వీక్ బెజవాడ బేబక్క, సెకండ్ వీక్ ఆర్జే శేఖర్ బాషా, మూడో వారం అభయ్ నవీన్ హౌజ్ వదిలి వెళ్లాల్సి వచ్చింది.

అయితే వీళ్ల స్థానంలో కొత్తగా నలుగురు వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అందులో ఇద్దరి పేర్లు ఇప్పటికే కన్ఫమ్ అయినట్లు ఓటీటీప్లే రిపోర్టు వెల్లడించింది. అందులో ఒకరు మాజీ కంటెస్టెంట్ ముక్కు అవినాశ్ కాగా.. మరొకరు టేస్టీ తేజ. ఈ ఇద్దరూ గతంలో బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసినవాళ్లే కావడం గమనార్హం. మరో ఇద్దరి పేర్లు బయటకు రావాల్సి ఉంది. ఈ వీకెండ్ కల్లా వీళ్లు హౌజ్ లోకి వెళ్లబోతున్నారు.

ALSO READ | కొరియోగ్రాఫర్ జానీ కేసులో అల్లు అర్జున్ జోక్యం చేసుకున్నారా?

ఇప్పటికే మాజీ ఇంటి సభ్యులతో బిగ్ బాస్ టీమ్ చర్చలు కూడా జరిపింది. అయితే, వారిలో చాలా మంది మళ్లీ బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదట. కానీ, ఓ ఇద్దరు మాజీ కంటెస్టెంట్స్ మాత్రం రావడానికి ఒప్పుకున్నారని షో మొదట్లోనే వినిపించింది. ఇక తాజా అప్డేట్ తో కక్లారిటీ వచ్చింది. 

అవినాష్, టేస్టీ తేజ ఈ సీజన్‌లోకి ఎంట్రీ ఇస్తుండటంతో అటు మిగతా కంటెస్టెంట్స్, ఇటు ప్రేక్షకులకు నవ్వుల వినోదమే అని తెలుస్తోంది. బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ స్లోగన్ "ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు" అనే ట్యాగ్ కి..ఈ ఇద్దరు పూర్తి న్యాయం చేస్తారని టాక్. ఏమవుతుందో చూడాలి.