బిగ్ బాస్ మూడో వారం నామినేషన్ల తంతు కూడా గొడవ మధ్య సాగింది. ఈ వీక్ లో హౌస్ లో 12 మందే ఉన్నారు. గత రెండు వీక్స్లో బెబక్క, శేఖర్ భాషా ఎలిమినేట్ అయినా విషయం తెలిసిందే.
తాజా ఎపిసోడ్ లో సోమవారం (సెప్టెంబర్ 16) నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగింది. తొలుత సీత.. యష్మి, పృథ్వీని నామినేట్ చేసింది. ఏ టాస్క్ జరిగినా సరే యష్మిది డామినేటింగ్ వాయిస్‌లా అనిపించిందని కారణం చెప్పింది.
అలానే గేమ్‌లో ప్రవర్తించిన తీరుపై సీత-పృథ్వీ మధ్య మాటల యుద్ధమే సాగింది.ఇక అంతేకాదు..మణికంఠ.. యష్మి, పృథ్వీని నామినేట్ చేశాడు. అయితే యష్మితో పెద్ద గొడవే పెట్టేసుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..
మణికంఠ V/s యష్మి
గత రెండు వారాలుగా చీఫ్ పోస్టులో ఉన్న యష్మీ మొదటిసారి నామినేషన్స్ లోకి వచ్చింది. దీంతో అందరూ కంటెస్టెంట్స్ యష్మిని నామినేట్ చేశారు. అందులో మణికంఠ ముందుగా యష్మిని నామినేట్ చేశారు.
గత నామినేషన్ల టైములో చీఫ్‍గా ఉన్న సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నావని అనిపించిందని మణికంఠ చెప్పాడు. అలాగే పక్షపాతంతో ఉన్నట్టు కూడా అనిపించిందని యష్మితో మణి చెప్పేసరికి ..ఎవరు గిన్నెలు కడుగుతున్నారు, ఎవరు కడగటం లేదు.. ఇలా అన్నీ చూడాలి అంటూ మణికంఠ చెబుతాడు.. అయితే మా టీమ్‌కి పవర్ వచ్చినప్పుడు మాకు ఆ అవసరం లేదని యష్మీ చెబుతుంది.
మణికంఠ మాట్లాడుతున్నప్పుడు యష్మి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయగా.. నేను మాట్లాడుతున్నప్పుడు వినడం నేర్చుకో లేడీ అని వేలు చూపించి మరీ మణికంఠ సీరియస్ అయ్యాడు.“నువ్వు మాట్లాడేటప్పుడు నేను విన్నా. నేను మాట్లాడేటప్పుడు వినండి. నేను మంచిగా మాట్లాడా. యాటిట్యూడ్ చూపించొద్దు” అని మణికంఠ అన్నారు. దీంతో యష్మి కూడా తనదైన శైలిలో రెచ్చిపోయింది. 'ఫ్రెండ్‌గా నా దగ్గరికొచ్చి నువ్వు డ్రామాలు చేస్తావ్ చూడు. అన్నీ ఫేక్' అని రివర్స్ కౌంటర్ ఇచ్చింది. అలాగే చీఫ్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలంటూ గట్టిగట్టిగా అరిచారు యష్మి. ఆ తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం గట్టిగానే జరిగింది.
ఈ సీజన్ లో తాను ఉన్నన్ని రోజులు మణికంఠను నామినేట్ చేస్తూనే ఉంటా అంటూ ఛాలెంజ్ చేసింది. ఫ్రెండ్షిప్ పేరుతో తనను మోసం చేశాడని.. తన హార్ట్ బ్రేక్ చేశాడంటూ చెప్పుకొచ్చింది.
అయితే హౌస్ లో ఫ్రెండ్ షిప్, గేమ్ రూల్స్ వేరు వేరుగా ఉంటాయని..రెండింటిని కలిపి అసలు చూడొద్దంటూ నామినేషన్స్ ప్రక్రియలో చెప్పాడు మణికంఠ. కానీ యష్మి అతడి మాటలను పట్టించుకోలేదు.
నబీల్ V/s ప్రేరణ
ఇకపోతే.. నైనికను సోనియా నామినేట్ చేయగా..అంతకుముందే చీఫ్‍గా ఫెయిలయ్యావని చెప్పానని..మళ్లీ తప్పులు చేశావనేలా సోనియా అన్నారు. అలాగే, నబీల్, ప్రేరణ మధ్య కూడా గొడవ గట్టిగానే జరిగింది. ఓ దశలో ఒకరికి ఒకరు ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్టు గట్టిగా అరుచుకున్నారు. గట్టిగా అరవాలంటే నేనూ కూడా అస్సలు తగ్గను..అంతకుమించి అరుస్తాను అంటూ నబీల్ మొత్తుకున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఇద్దరూ కాస్త వింతగా ప్రవర్తించారు.ఇది చూసిన ఆడియాన్స్ కు ఓ పిచ్చి డ్రామా అనేలా రియాక్ట్ అవుతున్నారు.
ఇకపోతే..బిగ్‍బాస్ మూడో వారం నామినేషన్స్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రేరణ, యష్మి, మణికంఠ, విష్ణుప్రియ, సీత, నైనిక, పృథ్వీ, అభయ్ నామినేట్ అయ్యారు