Bigg Boss Day 2: కంటెస్టెంట్ల మధ్య కొట్లాట..రెండు టాస్కులు..ఆ ముగ్గురు చీఫ్‍ల ఎంపిక

Bigg Boss Day 2: కంటెస్టెంట్ల మధ్య కొట్లాట..రెండు టాస్కులు..ఆ ముగ్గురు చీఫ్‍ల ఎంపిక

బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ (Bigg Boss Telugu 8) మొదలైంది. ఈ ఈవెంట్ లో హోస్ట్ నాగార్జున ఎంట్రీ అదిరింది. బిగ్‍బాస్ 8వ సీజన్ రెండవ రోజు షో (సెప్టెంబర్ 2) ఇంట్రెస్టింగ్‍గా సాగింది. కెప్టెన్ లేకపోయినా..ఆ స్థానంలో చీఫ్‍లు ఉంటారని బిగ్‍బాస్ చెప్పారు. ముగ్గురు చీఫ్‍లుగా ఎంపికయ్యారు. ఈ షోలో కొంతమంది కంటెస్టెంట్స్ మధ్య కొన్ని గొడవలు జరిగాయి. అయితే, ఎవరి మధ్య గొడవలు జరిగాయి? ఆ గొడవ ఎలా మొదలైంది? వంటి విషయాలు షో రెండవ రోజు విషయాలు తెలుసుకుందాం. 

Also Read:-ఆ రూమర్స్ ప్రేక్షకుల ఎగ్జైట్‍మెంట్ చంపేస్తాయి

టాస్క్ ద్వారా కాకుండా మూడో చీఫ్ సెలెక్షన్ విషయంలో బిగ్‍బాస్ మెలిక పెట్టడంతో కంటెస్టెంట్ల మధ్య గొడవ జరిగింది. బిగ్‍బాస్‍లో తొలి రోజు యాష్ కరో పాటతో షురూ అయింది. కంటెస్టెంట్లందరూ డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత నిత్యావసర సరుకులను హౌస్‍లోకి పంపారు బిగ్‍బాస్. డైనింగ్ హాల్ దగ్గర కంటెస్టెంట్లు మాట్లాడుకున్నారు. పనులను పంచుకున్నారు.

మొదటిగా హీరో ఆదిత్య ఓం..నాగమణికంఠ దగ్గరికొచ్చి సారీ చెప్పాడు. ఎవరిని హౌస్ నుంచి బయటికి పంపాలంటే నేను కావాలని నీ పేరు చెప్పలేదు అంటూ ఏదో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. దీనికి మణికంఠ కాస్త రెక్లెస్‌గా వదిలేయండి ఫర్లేదంటూ సైడ్ అయ్యాడు. ఇక అక్కడే ఉన్న నిఖిల్.. మణికంఠతో కాసేపు డిస్కషన్ వేసుకున్నాడు. ఆదిత్య అన్న పెద్దోడు కదా నువ్వు అలా గౌరవం లేకుండా మాట్లాడటం కరెక్ట్ కాదంటూ ఉచిత సలహాలు ఇవ్వబోయాడు. 

దీనికి కాసేపు సైలెంట్‌గా ఉన్న మణికంఠ ఏం చెప్పాలో, ఎలా ఆడాలో నాకు తెలుసు .. ఎవరి సలహాలు నాకు అక్కర్లేదంటూ పంచ్ ఇచ్చాడు. దీంతో కాస్త రెయిజ్ అయిన నిఖిల్.. ఓకే వదిలేసే అయినా అందరూ ఇక్కడికి కష్టపడే వచ్చారు.. నీ గురించి నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదంటూ డిస్కషన్ పెట్టాడు. 

సోనియా V/s శేఖర్ బాషా

కిచెన్‍లో కుక్కర్ సమస్య గురించి సోనియా ఆకుల, బెజవాడ బేబక్క మధ్య వాగ్వాదం జరిగింది. బేబక్క బాధ్యతగా లేరంటూ సోనియా అన్నారు. నారింజ పండ్లతో కొందరు క్యాచ్ ఆట ఆడడంతో సోనియా, ఆర్జే శేఖర్ బాషా మధ్య గొడవ జరిగింది. ఆడిన వాళ్లు పండ్లు తినడానికి వీల్లేదని, ఫుడ్‍ను అగౌరపరిచారని సోనియా అన్నారు. ఆడాను.. తింటాను అని శేఖర్ వాదించారు. తాము మనుషుల్లాగా తినాలనుకుంటున్నామని సోనియా అన్నారు. దీంతో కోపం తెచ్చుకున్న శేఖర్.. ‘నేను మనిషిని కాదా.. ఇది తింటే పుశువునా’ అంటూ అరిచారు.

‘పట్టుకొని ఉండండి.. వదలకండి’ అంటూ తొలి టాస్క్ ఇచ్చారు బిగ్‍‍బాస్. ఈ టాస్కుకి ఆ ఆరుగురు పోటీ పడ్డారు. యష్మీ గౌడ, శేఖర్ బాషా, నైనిక, బెజవాడ బేబక్క, నిఖిల్, అఫ్రిది పోటీపడ్డారు. ఓ బోనులో రంగుల తాళ్లను ఎక్కువ సేపు పట్టుకున్న వాళ్లు విన్నర్ అని బిగ్‍బాస్ చెప్పారు. స్పిన్నింగ్ వీల్‍లో వచ్చిన కలర్స్ తెంపడం, దాన్ని బట్టి కంటెస్టెంట్లు వేరే కలర్ తాడును పట్టుకోవడం లాంటి రూల్స్ చెప్పారు. ఈ టాస్కులో చివరికి నిఖిల్ మయక్కల్ గెలిచారు. బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో ఫస్ట్ చీఫ్ అయ్యారు. 'బ్రిక్స్ బ్రేకింగ్' అంటూ రెండు టాస్కులు ఇచ్చాడు బిగ్‌బాస్.

దీంతో తొలిరోజు నుంచే బిగ్‌బాస్ తన అసలైన గేమ్ షురూ చేసినట్టు నెటిజన్స్ నుంచి అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రెండు చిల్లర గొడవలు, రెండు టాస్కులతో బాగానే ఎంగేజ్ చేశాడు బిగ్ బాస్. ఫస్ట్ చీఫ్‍గా  నిఖిల్, రెండో చీఫ్‍గా నైనిక, యష్మి గౌడను మూడో చీఫ్‍గా ఎంపిక చేశారు.