Lambasingi OTT: ఓటీటీకి వచ్చేసిన గ్లామర్ దివి లంబసింగి..స్ట్రీమింగ్ ఎక్కడంటే? 

భరత్‌‌‌‌‌‌‌‌ రాజ్‌‌‌‌‌‌‌‌, దివి జంటగా నవీన్ గాంధీ తెరకెక్కించిన చిత్రం ‘లంబసింగి’(Lambasingi).బంగార్రాజు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల (Kalyan Krishna) సమర్పణలో ఆనంద్.టి నిర్మించిన ఈ చిత్రం మార్చి 15న థియేటర్స్‌‌‌‌‌‌‌‌లో రిలీజై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆడియన్స్ ను కొంతమేరకు మెప్పించిన..పెద్ద సక్సెస్ అవ్వలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా నెల తిరగకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. లంబసింగి మంగళవారం (ఏప్రిల్‌ 2) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు అవుతుంది. ఈమేరకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఆఫీసియల్ అనౌన్స్ మెంట్ కూడా చేసింది. మరి థియేటర్లలో చూడని వారు ఇంట్లోనే కూర్చొని లవ్ స్టోరీని ఎంజాయ్ చేయండి.

ఒక స్వచ్ఛమైన ప్రేమకథను కళ్ళకు కట్టినట్లు సహజంగా చూపించారు డైరెక్టర్ నవీన్ గాంధీ. ఆర్.ఆర్.ధ్రువన్ అద్బుతమైన పాటలతో పాటు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ ఇచ్చాడు. హృదయాన్ని కదిలించే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అయిన లంబసింగి..ఓటీటీ ఆడియన్స్ ను ఎలా మెప్పిస్తుందో చూడాలి. 

‘లంబసింగి'కథేంటంటే.. 

వీరబాబు (భరత్‌ రాజ్‌) కానిస్టేబుల్ ఉద్యోగం వస్తుంది. తొలి పోస్టింగ్‌ లంబసింగి అనే ఊరిలో పడుతుంది. అక్కడ నక్సల్స్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఊర్లోకి వెళ్లిన తొలి రోజే హరిత(దివి)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె లొంగిపోయి సాధారణ జీవితం గడుపుతున్న నక్సలైట్‌ కోనప్ప కూతురు. కోనప్పతో పాటు చాలా మంది నక్సలైట్లు లొంగిపోయి అదే ఊరిలో  సాధారణ జీవితం గడుపుతుంటారు. పోలీసు శాఖే వారికి బతకడానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. హరిత ఆ ఊరి ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తూ తండ్రికి అన్నివిధాలుగా తోడుగా ఉంటుంది. సంతకాల పేరుతో రోజు కోనప్ప ఇంటికి వెళ్తూ హరితను ఫాలో అవుతుంటాడు వీరబాబు. అలా వారిద్దరి మధ్య స్నేహం పెరుగుతుంది. ఓ రోజు వీరబాబు ప్రపోజ్‌ చేస్తే హరిత రిజెక్ట్‌ చేస్తుంది.

ALSO READ :- Kismath OTT: సైలెంట్గా OTTకి వచ్చిన కిస్మత్.. ఈ కామెడీ థిల్లర్ ఎక్కడ చూడొచ్చంటే?

అదే బాధలో ఉండగా.. పోలీసు స్టేషన్‌పై నక్సలైట్లు దాడి చేస్తారు. ఆ దాడిలో గాయపడిన వీరబాబుకి ఊహించని షాక్‌ తగులుతుంది. అదేంటి? అసలు హరిత ఎవరు? వీరబాబు ప్రేమను ఎందుకు నిరాకరించింది? ఆమె కోసం వీరబాబు తీసుకున్న నిర్ణయం ఏంటి? చివరకు హరిత ప్రేమను వీరబాబు పొందాడా లేదా? అనేది ఈ సినిమా కథ.