
బిగ్ బాస్ ఫేం 7 ఆర్ట్స్ సరయు ఏపీ, తెలంగాణ విశ్వహిందూ పరిషత్ కు క్షమాపణలు చెప్పింది. హిందువుల మనోభావాలు దెబ్బతీని ఉంటే తాను క్షమాపణ చెబుతున్నానని తెలిపింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఓ వీడియోలో నటించిందని ఫిర్యాదు చేయడంతో రెండు రోజుల క్రితం బంజారాహిల్స్ పోలీసులు సరయును అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని హిందూ సంఘాల నేత అశోక్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సరయుపై కేసు నమోదు చేసి బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. సరయుపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి విచారణ చేశారు. అయితే ఇవాళ క్షమాపణలు చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది సరయు.
ఏడాది క్రితం గిప్పనిస్తా అనే షార్ట్ ఫిలింలో నటించానని.. అందులో 7 ఆర్ట్స్‌కు సిరిసిల్లలో ఒక బిర్యానీ ఫ్రాంచైజీ ఓపెన్ చేశామన్నారు. ఈ బిర్యానీ ప్రమోషన్‌లో గణపతి బప్పా రిబ్బన్ కట్టుకుని మందు తాగామని.. అయితే రజనీ కాంత్ పేటా సినిమాలో విజయ్ సేతుపతికి సంబంధించిన ఒక సీన్‌ను రిఫరెన్స్‌గా తీసుకునే అలా చేశామని చెప్పింది. ఒక హిందూ అమ్మాయిగా హిందువుల మనోభావాలను కించపరచబోనని.. మీ మనోభావాలు దెబ్బతిని ఉంటే సారీ’అని చెప్పింది సరయు.