Amar Deep New Car: లగ్జరీ కారుకొన్న బిగ్ బాస్ అమర్ దీప్.. ఎన్ని లక్షల్లో తెలుసా?

Amar Deep New Car: లగ్జరీ కారుకొన్న బిగ్ బాస్ అమర్ దీప్.. ఎన్ని లక్షల్లో తెలుసా?

సీరియల్ నటుడు అమర్ దీప్(Amar Deep) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీరియల్ నటుడిగా అయన కొంతమందికి మాత్రమే పరిచయం అయ్యారు కానీ, బిగ్ బాస్ సీజన్ 7 ద్వారా తెలుగులో మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ఇక సీజన్ 7లో అమర్ పై జరిగిన ట్రోలింగ్, కాంట్రావర్సీల గురించి ఎంత చెప్పునా తక్కువ. ఇక సీజన్ ముగిసాక తన పని తాను చేసుకుంటున్న అమర్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. 

కారణం.. ఇటీవల ఆయన లగ్జరీ కారును కొనుగోలు చేశారు. టాటా కంపెనీకి చెందిన సఫారీ మోడల్ ని ఆయన కొన్నారు. దీని ధర దాదాపు రూ.25 లక్షలకు పైనే ఉంటుందని సంచారం. ఇదే విషయానై తెలియజేస్తూ అమర్ భార్య తేజస్విని ఓ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడేమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్స్ అమర్ దీప్ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇక అమర్ దీప్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే పూజాకార్యక్రమాలతో లాంఛనంగా మొదలైన ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమానే కాకుండా.. తన అభిమాన నటుడు రవితేజతో కూడా ఒక సినిమా చేస్తున్నారు అమర్ దీప్.