Pallavi Prashanth: రాజకీయాలంటే రస్నా తాగడం అనుకున్నావా.. పల్లవి ప్రశాంత్పై నెటిజన్స్ ఫైర్

Pallavi Prashanth: రాజకీయాలంటే రస్నా తాగడం అనుకున్నావా.. పల్లవి ప్రశాంత్పై నెటిజన్స్ ఫైర్

బిగ్ బాస్(Bigg Boss) ఫేమ్ పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) పై నెటిజన్స్ మరోసారి రెచ్చిపోతున్నారు. ట్రోల్స్ చేస్తూ దారుణంగా వాడేసుకుంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 టైంలో కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ ఐన పల్లవి ప్రశాంత్.. మరోసారి అలాంటి కామెంట్స్ చేసి నెటిజన్స్ బారిన పడ్డాడు. దాంతో చిత్రవిచిత్రమైన కామెంట్స్ చేస్తూ పల్లవి ప్రశాంత్ పై ఫైర్ అవుతున్నారు.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. బిగ్ బాస్ రైతు బిడ్డగా పేరు సంపాదించుకున్న పల్లవి ప్రశాంత్. అదే సెంటిమెంట్ తో విన్నర్ గా కూడా నిలిచాడు. ఇక బిగ్ బాస్ విన్ అయిన అనంతరం తాను గెలుచుకున్న డబ్బును రైతులకు పంచుతానని చెప్పుకొచ్చాడు. ఈ స్టేట్మెంట్ తో కూడా ఫుల్లలుగా పాపులర్ అయ్యాడు ప్రశాంత్. అయితే బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన అనంతరం తాను చెప్పినట్టుగా డబ్బులు పంచలేదు. దీంతో సోషల్ మీడియాలో అతనిపై నెగిటివిటీ క్రియేట్ అయ్యింది.

దాంతో.. రీసెంట్ గా ఒక పేద రైతు కుటుంబానికి లక్ష సహాయం చేశాడు పల్లవి ప్రశాంత్. ఈ కార్యక్రమంలో నటుడు శివాజీ, షన్స్ మాస్టర్ సందీప్ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు ప్రశాంత్. ఈ ఇంటర్వ్యూలో మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశాడు ప్రశాంత్.. ఇందులో భాగంగా తనని సీఎం చేయాలని, తనను సీఎం చేస్తేనే రైతులు బాగుపడతారని చెప్పుకొచ్చాడు.

ALSO READ :- IT Layoff : 7 నిమిషాల మీటింగ్.. రెండు డిపార్ట్ మెంట్స్ క్లోజ్.. ఐటీలో సంచలనం

 దీంతో నెటిజన్స్ పల్లవి ప్రశాంత్ పై కామెంట్స్ తో విరుచుకుపడుతున్నారు. రాజకీలాయంటే రస్నా తాగినంత ఈజీ అనుకుంటున్నావా తమ్ముడు. సీఎం సరిపోతుందా.. లేక పీఎం కూడా చేయమంటావా? రాజకీయాలంటే అంత జోక్ అయిందా బ్రదర్ నీకు? ఇలా నోటికేదొస్తే అది మాట్లాడటం కాదు.. కాస్త ఆలోచించి మాట్లాడని అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మరి ఈ కామెంట్స్ పై పల్లవి ప్రశాంత్ ఎలా స్పందిస్తాడో చూడాలి.