![Shobha shetty: కాబోయే భర్తకు ఖరీదైన కారు గిఫ్ట్గా ఇచ్చిన శోభా శెట్టి](https://static.v6velugu.com/uploads/2024/06/bigg-boss-fame-shobha-shetty-gifted-an-expensive-car-to-her-fiance-yashwant_Xs1r50Jp8d.jpg)
కార్తీక దీపం నటి శోభా శెట్టి.. అదేనండి మోనిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ లో నెగిటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించిన ఆమె ఆడియన్స్ లో మంచి ఆదరణ తెచ్చుకుంది. ఆ ఫేమ్ తోనే బిగ్ బాస్ సీజన్ 7లో అడుగుపెట్టింది శోభా. తన ఆటతో లక్షల మంది అభిమానాన్ని దక్కించుకుంది. ఇక బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తరువాత తన ప్రియుడు యశ్వంత్ తో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది.
ఇటీవలే ఈ ఇద్దరు నిశ్చితార్ధ వేడుక ఘనంగా జరిగింది. త్వరలోనే ఈ జంట పెళ్లి బంధంతో ఒకటి కానున్నారు. ఈ నేపధ్యంలోనే కాబోయే భర్త యశ్వంత్ కు ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇంచింది శోభా. యశ్వంత్ పుట్టినరోజు సందర్భంగా బీస్ట్ ఎక్స్‌యూవీ 700 కారుని బహుమతిగా ఇంచ్చింది. ఈ కారు ధర రూ.17 నుండి రూ.20 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా నెటిజన్స్ తో పంచుకున్నారు శోభా. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.