బిగ్ బాస్ గీతూ(Bigg boss Geethu) అలియాస్ గీతూ రాయల్(Geethu Royal) గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె చేసే వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. అలా ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది గీతూ. అంతేకాదు బిగ్ బాస్ రివ్యూవర్ గా కూడా పాపులర్ ఆయ్యింది గీతూ. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ సీజన్ 6లో అడుగుపెట్టింది. ఎన్నో ఆశలతో బాగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన గీతూ.. అత్యుత్సాహంతో మధ్యలోనే ఎలిమినేట్ అయ్యింది. ఇక తాజాగా జరిగిన బిగ్ బాస్ సీజన్ 7 బజ్ కి యాంకర్ గా వ్యవహరించింది గీతూ. తన ప్రశ్నలతో కంటెస్టెంట్స్ ను కన్ఫ్యూజ్ చేయడంలో సక్సెస్ అయ్యింది.
ఇదిలా ఉంటే.. తాజాగా గీతూ ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమాపై తన రివ్యూ ఇచ్చారు. తన సోషల్ మీడియాలో సలార్ గురించి తన అభిప్రాయాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ.. సలార్ మూవీ చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. ముందు ట్రైలర్స్ చూసి ప్లాప్ అవుతుంది అనుకున్నాను కానీ.. సినిమా నెక్స్ట్ లెవల్లో ఉంది. ప్రభాస్ కటౌట్ మాత్రం అదిరిపోయింది. అయితే.. ట్విస్టులు, చాలా పాత్రల వాళ్ళ కాస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాను. కొన్నిచోట్ల అర్థం కాలేదు. రెండుసార్లు చూస్తే అర్థమవుతుంది. మరి నా బ్రెయిన్ అంత తెలివిగా ఆలోచించలేదేమో. నాకు అర్థంకాలేదు.. అంటూ చెప్పుకొచ్చింది గీతూ. దీంతో గీతూ రాయల్ పై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సలార్ సినిమాలో అర్థం కాకపోవడానికి ఏముంది. అంత క్లియర్ గా ఉన్న సినిమాను కూడా అర్థం చేసుకోలేవా? ఇలాంటి నెగిటివ్ రివ్యూలు ఇవ్వడం మానెయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.