
Savithri: మహానటి సావిత్రి జీవితం అందుకే నాశనమైంది: గీతూ రాయల్తెలుగు బిగ్ బాస్ 6వ సీజన్ లోకంటెస్టెంట్ గా పాల్గొని అలరించిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గీతూ రాయల్ టాలీవుడ్ ఆడియన్స్ కి సుపరిచితమే.. అయితే గీతూ రాయల్ ఈమధ్య కొటేషన్స్, లైఫ్ ఫ్యాక్ట్స్ వంటివి చెబుతూ ఫాలోవర్స్ ని బాగానే పెంచుకుంది. అయితే ఇటీవలే గీతూ రాయల్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో కాంట్రవర్సీగా మారింది.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే మానవ సంబంధాలు ఎలా ఉండాలనే విషయం గురించి మాట్లాడుతూ గీతూ రాయల్ ప్రముఖ స్వర్గీయ నటి మహానటి సావిత్రి పేరు తీసింది. ఈ క్రమంలో సావిత్రి గురించి మాట్లాడుతూ " లైఫ్ లో ఎప్పడూ కూడా ఒకరు ప్రేమించిన, పెళ్ళైన వ్యక్తులని కోరుకోకండి. ఉదాహరణకి సావిత్రి గారు అప్పటికే పెళ్లయి, పిల్లలున్న ప్రముఖ స్వర్గీయ నటుడు, నిర్మాత జెమినీ గణేష్ ని ప్రేమించి పెళ్లి చేసుకుందని కానీ చివరికి జెమినీ గణేశన్ మాత్రం సావిత్రిని వదిలేసి వెళ్లిపోయాడని తెలిపింది.. అలాగే ఒకరు మనకోసం ఇంకొకరిని వదిలేసి వచ్చినప్పుడు.. మరొకసారి ఇంకొకరి కోసం మనల్ని వదిలేసి వెళ్లిపోవడానికి ఏమాత్రం వెనుకాడరని.. అందుకే మహానటి సావిత్రి జీవితం నాశనమైందని సంచలన వ్యాఖ్యలు చేసింది..
దీంతో గీతూ రాయల్ మహానటిపై చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.. ఈ వీడియోపై కొందరు సావిత్రి అభిమానులు స్పందిస్తూ గీతూ రాయల్ పై ఫైర్ అవుతున్నారు.. చిల్లర వీడియోలు, సొల్లు కొటేషన్స్ చెప్పి సోషల్ మీడియాలో పాపులర్ అయిన వాళ్ళకి నటి సావిత్రి పేరెత్తే అర్హత లేదని నెటిజన్లు మండి పడుతున్నారు. అలాగే కంటెంట్ కరెక్ట్ గా తెలియకుండా వ్యూస్ కోసం ఏదిపడితే అది చెబుతూ వీడియోలు చేయొద్దని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.