బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7)లో తొమ్మిదవ వారం ఎలిమినేషన్ కు సమయం ఆసన్నమైంది. ఈ వారం నామినేషన్స్ లో అమర్, రతికా, శోభా, ప్రియాంక, అర్జున్, తేజ, భోలే, యావర్ ఉన్నారు. ఇందులో శోభా, తేజకు ఇప్పటికే ఎలిమినేషన్ భయం పట్టుకుంది. అందుకే పదే పదే అదే విషయం గురించి మాట్లాడుకుంటున్నారు ఈ ఇద్దరు కంటెస్టెంట్స్.
నిజానికి గతవారమే శోభా ఎలిమినేట్ అవ్వాల్సింది. కానీ అనూహ్యంగా సందీప్ బయటకు వెళ్ళిపోయాడు. సీజన్ మొదలైనప్పటి నుండి సందీప్ నామినేషన్స్ లో లేకపోవడంతో అతను బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఇక వారం తప్పకుండ శోభా బయటకుక్ వెళ్తుంది అని అనుకున్నారు అంతా.. అయితే తాజాగా జరిగిన కెప్టెన్సీ టాస్క్ చివరి గేమ్ లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్.
కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా.. బిగ్ బాస్ బీన్ బ్యాగ్ గేమ్ ఆడించాడు. ఈ గేమ్ లో శోభా కోసం అమర్ గేమ్ ఆడి ఆమెను కెప్టెన్ ను చేశాడు. దీంతో ఆమెకు నెక్స్ట్ వీక్ ఆమెకు ఇమ్యూనిటీ లభించింది. అయితే ఈ వారానికి మాత్రం ఆమె ఇంకా డేంజర్ జోన్ లోనే ఉంది. ఒక వేళా ఈ వేల ఆమె ఈ వారం కూడా సేవ్ అయితే.. వచ్చే వారం కూడా ఆమె ఇంటినుండి బయటకు వెళ్లే అవకాశం ఉండదు.
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ సీజన్‌లో కూడా ఇలాంటిదే జరిగింది. ఆర్జే చైతూ కోసం అఖిల్ ఆడి అతన్ని కెప్టెన్ చేశాడు. కానీ ఆ వారమే చైతూ ఎలిమినేట్ అయ్యాడు. మరి ఇప్పుడు శోభాకు కూడా అలానే జరుగుతుందా? లేదంటే తన స్థానంలో వేరే ఎవరైనా ఎలిమినేట్ అవుతారా అనేది ఆసక్తికరంగా మారింది.
ALSO READ :- తెలంగాణ ప్రజల తీర్పు కోసం రాష్ట్రమంతా ఎదురుచూస్తోంది : బండి సంజయ్