వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో తెలుగు బిగ్‌బాస్ (Bigg Boss) సీజన్-7లో రెండో వారం కూడా పూర్తి కావొచ్చింది. దీంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారు అనేదానిపైనే అందరి దృష్టి పడింది. ఈ వారం నామినేషన్‌లో ఏకంగా తొమ్మిది నిలువగా.. అందులో శివాజీ, పల్లవి ప్రశాంత్, రతిక, తేజ, అమర్ దీప్, షకీలా, గౌతమ్ కృష్ణ, శోభా శెట్టి అండ్ ప్రిన్స్ యావర్ ఉన్నారు.
వోటింగ్ ప్రకారం చేసుకుంటే.. గత వారం లాగే ఈ వారం కూడా పల్లవి ప్రశాంత్ కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. తక్కువ ఓట్లు షకీలా అండ్ టేస్టీ తేజాకు వచ్చాయని సమాచారం. డేంజర్ జోన్ లో ఉన్న ఈ ఇద్దరిలో షకీలా ఈవారం ఎలిమినేట్ కానుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. టేస్టీ తేజ వల్ల ఇంట్లో కాస్త ఫన్ జెనరేట్ అవుతోంది కాబట్టి అతనికి కాస్త ఎక్కువగా ఓట్లు పడ్డాయట.ఇక ఇక్కడ వినిపిస్తున్న మరో న్యూస్ ఏంటంటే.. షకీలా, తేజ ఇద్దరినీ ఎలిమినేట్ చేసి. అందులో ఒకరిని సీక్రెట్ రూమ్ కు పంపించనున్నారట. అంతేకాదు.. మరి ఇద్దరు కంటెస్టెంట్స్ ను వైల్డ్ కార్డు ద్వారా ఇంట్లోకి పంపించనున్నారట.
ALSO READ: కేసీఆర్‌కు మోసం చేస్తే సేవాలాల్‌కు చేసినట్లే : మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
మరి ఇదే గనుక నిజమైంతే.. బిగ్ బాస్ సీజన్ 7లో అసలైన ఆట ఇప్పుడు మొదలవుతుందని చెప్పొచ్చు. వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ మధ్యలో వస్తారు కాబట్టి.. వారిని తమలో కలుపుకోవడానికి కాస్త టైం పడుతుంది. కాబట్టి ఈ గ్యాప్ లో బిగ్ బాస్ వాళ్ళ మధ్య చిచ్చు పెట్టించడం మొదలుపెట్టాడతాడు. దీంతో మల్లి గొడవలు మొదలు. దాంతో ఆడియన్స్ కు ఫన్. చూడాలి మరి ఏ వారం బిగ్ బాస్ ఎలాంటి ట్విస్ట్ ఇవ్వనున్నాడో అని.