Bigg Boss: తమిళ్ బిగ్బాస్ విజేతను ప్రకటించిన విజయ్ సేతుపతి.. ప్రైజ్ మనీ ఎంత? ఎవరీ ముత్తు కుమారన్?

Bigg Boss: తమిళ్ బిగ్బాస్ విజేతను ప్రకటించిన విజయ్ సేతుపతి.. ప్రైజ్ మనీ ఎంత? ఎవరీ ముత్తు కుమారన్?

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) తొలిసారి హోస్ట్గా చేసిన బిగ్ బాస్ తమిళ సీజన్ 8 (Bigg Boss Tamil 8) ముగిసింది. ఆదివారం (జనవరి 19న) తమిళ సీజన్ 8 విజేతగా ముత్తుకుమారన్ (Muthukumaran) నిలిచారు.

హీరో కం హోస్ట్ విజయ్ సేతుపతి చేతుల మీదుగా ముత్తుకుమారన్ బిగ్ బాస్ ట్రోఫీ అందుకున్నారు. దాంతో పాటు రూ.41 లక్షల నగదు బహుమతిని ఇంటికి పట్టుకెళ్ళాడు. ఈ సీజన్ 8లో మొదటి రన్నర్గా సౌందర్య, రెండవ రన్నరప్‌గా VJ విశాల్ నిలిచారు.

సీజన్8 మొదటి నుండి ముత్తుకుమరన్ టైటిల్ బరిలో ఉన్నాడు. అందుకు తగ్గట్టుగానే తన ఆటని ప్రదర్శించి బిగ్ బాస్ సీజన్ 8లో విజేతగా గెలుపొందాడు. అయితే, ఈ విజేతను ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా ఎంపిక చేశారు.

ప్రైజ్ మనీ ఎంత?

బిగ్ బాస్ తమిళ్ 8 గ్రాండ్ ఫినాలే జనవరి 19న సాయంత్రం 6 గంటల నుంచి 11 వరకు జరిగింది. ఇందులో కంటెస్టెంట్స్ ముత్తుకుమారన్ మరియు సౌందర్య మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇక అన్ని విషయాలు పరిగణించి విజయ్ సేతుపతి ముత్తుకుమారన్ చేయి పైకెత్తి విజేతగా నిలిచినట్లు ప్రకటించారు. అయితే, విజయ్ సేతుపతి బిగ్ బాస్ తమిళ 8 విన్నర్ కి ట్రోఫీ మరియు రూ. 40.5 లక్షల చెక్కును అందించాడు. గత వారం 'మనీ బాక్స్' టాస్క్‌లో ముత్తుకుమరన్ రూ.50,000 గెలుచుకున్నాడు. దాంతో మొత్తం రూ.41 లక్షలును ఇంటికి తీసుకెళ్లాడు.

Also  Read :  బరితెగించిన రియాల్టీ షోలు

అయితే, బిగ్ బాస్ హిందీ 18 సీజన్ కూడా ఆదివారం (జనవరి 19న) ముగిసింది. ఇందులో విజేతగా కరణ్ వీర్ మెహ్రా (Karan Veer Mehr) నిలిచారు. 46 ఏళ్ల కరణ్ వీర్ మెహ్రా ఈ షో ద్వారా రూ. 50 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. దాంతో తమిళ, హిందీ బిగ్ బాస్ షోస్ ప్రైజ్ మనీ మధ్య తేడా ఎంతనే చర్చ మొదలైంది.

హిందీ బిగ్ బాస్ విన్నర్‌కు 50 లక్షల ప్రైజ్ మనీ వస్తే.. తమిళ బిగ్ బాస్ విజేతకు 40.5 లక్షలు బహుమతిగా లభించింది. ఈ లెక్కన ఇద్దరి ప్రైజ్ మనీలో తొమ్మిదిన్నర లక్షల (9.5 లక్షలు) తేడా వచ్చింది. కాకపోతే వీరు అందుకున్న మొత్తం చివరి లెక్క వరకు ఎంతనేది బిగ్ బాస్ యాజమాన్యం వెల్లడించలేదు. 

ఎవరీ ముత్తు కుమారన్?

తమిళ సీజన్ 8 ముత్తుకుమారన్ విషయానికి వస్తే.. 1997 నవంబర్ 26న కరైకుడిలో జన్మించాడు. 2019లో నాన్ ముత్తు కుమారన్ అనే యూట్యూబ్ ఛానెల్‌ను స్టార్ట్ చేసి ఫేమస్ అయ్యాడు. యూట్యూబర్‌గా స్పష్టమైన ఆలోచన, భాషపై ఉన్న పట్టు, బ్లాగ్స్‌ చేయడం, సినిమా రివ్యూలు ఇవ్వడం ఇలా ముత్తుకుమారన్ ను బిగ్ బాస్ వరకు నడిపింది. ముత్తు షోలో కూడా తన ఆటతో మరింతమందికి దగ్గరయ్యి విజేతగా నిలిచాడు. ముత్తు కుమారన్కి సినిమాల్లో ప్యాషన్ ఉండటంతో తమిళ పరిశ్రమ నుంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.