Bigg Boss Tamil Season 8: తమిళ బిగ్బాస్ సీజన్ 8 లాంచ్.. డేట్, టైమ్ అనౌన్స్.. కంటెస్టెంట్స్ వీళ్లే!

Bigg Boss Tamil Season 8: తమిళ బిగ్బాస్ సీజన్ 8 లాంచ్.. డేట్, టైమ్ అనౌన్స్.. కంటెస్టెంట్స్ వీళ్లే!

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) టాలీవుడ్, కోలీవుడ్ లో తన సహజ నటనతో ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారు. హీరోగా, విలన్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే.. తమిళ బిగ్ బాస్ 8(Bigg Boss Tamil 8)కి కమల్ హాసన్ స్థానంలో కొత్త హోస్ట్గా వ్యవహరిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. 

ALSO READ | MamithaBaiju: బంపర్ ఆఫర్ కొట్టేసిన ప్రేమలు హీరోయిన్.. దళపతి విజయ్ సినిమాలో ఛాన్స్!

తాజాగా ఇవాళ అక్టోబర్ 2న ఈ రియాల్టీ షో ప్రీమియర్ డిటైల్స్ ప్రకటించింది. అక్టోబర్ 6న సాయంత్రం 6 గంటలకు విజయ్ టెలివిజన్‌లో ప్రీమియర్ షో స్టార్ట్ అవ్వనుంది. ఈ ప్రారంభ ఎపిసోడ్ సాయంత్రం 6 నుంచి రాత్రి 11 గంటలకు ఐదు గంటల పాటు కొనసాగుతుందని తెలిపింది. ఈ ఎపిసోడ్‌లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ను పరిచయం చేయనుంది. కాగా ఈ బిగ్ బాస్ షో వీక్లీ ఎపిసోడ్‌లు విజయ్ టీవీలో రాత్రి 9.30 నుంచి 10.30 గంటల వరకు ప్రసారం కానున్నాయి. అలాగే విజయ్ ఛానెల్‌తో పాటు, డిస్నీ+ హాట్‌స్టార్‌లో కూడా రియాలిటీ షోను చూడవచ్చని యాజమాన్యం తెలిపింది. 

ఇక కంటెస్టెంట్లు విషయానికి వస్తే.. దాదాపు 16 మంది కంటెస్టెంట్లు అక్టోబర్ 6న బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. తర్వాత, షోలో నలుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు మిగిలిన వారితో చేరనున్నారు.మరి ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరనేది చూస్తే.. 

కంటెస్టెంట్స్ జాబితా::

1. వీటీవీ గణేష్ - నటుడు, నిర్మాత
2. సునీతా గోగోయ్ డ్యాన్సర్ 
3. పాల్ డబ్బా అకా అనీష్ - రాపర్
4. అన్షిత అక్బర్షా - టెలివిజన్ సీరియల్ నటి
5. KR గోకుల్ - డాన్సర్
6. ఐశ్వర్య - నటి
7. అరుణ్ ప్రసాత్ - టెలివిజన్ సీరియల్ నటుడు
8. దార్శిక
9. సౌందర్య నంజుండన్ - నటుడు
10. VJ విశాల్ - టెలివిజన్ సీరియల్ నటుడు మరియు హోస్ట్
11.రవీంద్రన్ నటుడు
12.రంజిత్ నటుడు
13.బబ్లూ పృథివీరాజ్ నటుడు
14.ఫరీనా ఆజాద్ నటి
15.పవిత్ర జనని నటి
16. పూనమ్ బజ్వా నటి
అలాగే దీపక్ దినకర్, సచనా నామిదాస్, అలియా మానస, హాస్యనటుడు కురైషి పేర్లు వినిపిస్తున్నాయి. త్వరలో బిగ్ బాస్ యాజమాన్యం అధికారికంగా కంటెస్టెంట్స్ లిస్ట్ ప్రకటించనుంది.

అయితే తమిళ బిగ్ బాస్ సీజన్ 1 అంటే.. 2017 నుంచి ఈ షోకు లోకనాయకుడు కమల్ హాసన్ హోస్టింగ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ షో సీజన్ 8 నుంచి తప్పుకున్నారు కమల్. ప్రస్తుతం చేతి నిండా సినిమాలు, షూటింగ్స్ అంటూ బిజీగా ఉండడంతోనే కమల్ ఈ షో నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది.