బిగ్బాస్ సీజన్ 8 (Bigg Boss Telugu 8) ప్రస్తుతం పదో వారం ఎలిమినేషన్ వీక్ ఇన్ట్రెస్టింగ్గా ఉండనుంది. ఓటింగ్ లెక్కలు తారుమారయ్యాయి. కంటెస్టెంట్స్కే దిమ్మతిరిగేలా ఓట్లు గుద్దుతున్నారు ఆడియన్స్. వివరాల్లోకి వెళితే
ఈ పదోవారం ఏడుగురు నామినేషన్ కంటెస్టెంట్స్ ఉన్న విషయం తెలిసిందే. అందులో గౌతమ్, నిఖిల్, పృథ్వీ, యష్మీ, ప్రేరణ, విష్ణుప్రియ, హరితేజ ఉన్నారు. గౌతమ్.. కన్నడ బ్యాచ్కు నిద్ర లేకండా చేస్తున్నాడు. పదో వారంలో ఓటింగ్‌లో నంబర్ వన్గా దూసుకెళ్తున్నారు. మొదటి నుంచే తన ఆటతో అందరినీ ఆకట్టుకుంటూ ఓటింగ్లో దంచికొడుతున్నాడు.
అతని తర్వాత నిఖిల్ రెండో స్థానంలో ఉన్నాడు. అయితే నిఖిల్ గ్రూప్ గేమ్ ఆడుతూ తక్కువైపోతున్నాడు. అంటే.. కన్నడ బ్యాచ్ అయిన యష్మీ, ప్రేరణ, పృథ్వీ ఇలా. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే.. ఈ కన్నడ టీమ్ అంతా నామినేషన్స్లో ఉంది.
ఇకపోతే 2 రోజుల కింద ఓటింగ్ వివరాలు చూసుకుంటే.. గౌతమ్ టాప్లో ఉండగా.. నిఖిల్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. విష్ణు ప్రియ, హరితేజ చివరి రెండుస్థానంలో నిలిచారు. కానీ, ఇప్పుడు ఫైనల్ డే వచ్చేసరికి ఆడియన్స్ తమ ఓటింగ్తో కంటెస్టెంట్స్ స్థానాలు పూర్తిగా మారిపోయాయి.
ప్రస్తుతం ఓటింగ్ వివరాలు చూసుకుంటే.. యష్మీ, విష్ణు స్థానాలు మారిపోయాయి. దాంతో ఈ వారం డేంజర్ జోన్‌లో యష్మీ, హరితేజ ఉన్నారు. మూడో స్థానంలో ప్రేరణ, నాలుగో స్థానంలో పృథ్వీ, ఐదో స్థానంలో యాంకర్ విష్ణుప్రియ, ఆరో స్థానంలో యష్మీ, ఏడో స్థానంలో హరితేజ ఉన్నారు.
అయితే యష్మికి ఉన్న క్రేజీతో ఫ్యాన్స్ ఎలాంటి ఓటింగ్తో సేఫ్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ ఉంది. కాగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన హరితేజ ఈ వారం ఎలిమినేట్ అవుతారనే న్యూస్ గట్టిగా వినిపిస్తోంది.
ఇకపోతే కంటెస్టెంట్‌గా వచ్చిన చీఫ్ గెస్ట్ గంగవ్వ ఈవారం కాకపోతే వచ్చేవారమైనా హౌస్‌ను వీడాల్సిందే అని తనను పంపిస్తే.. హరితేజ సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి నాగార్జున ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడో తెలియాలంటే ఇంకొక్క రోజు ఆగాల్సిందే.
అయితే ఎగ్ టాస్క్ ఆడి గెలిచిన నబీల్‌కు ఫ్రీ ఎవిక్షన్ పాస్ దొరికింది. ఈ పాస్ ద్వారా సీజన్ 8 ఎలిమినేషన్ నుంచి అతను సేవ్ అవ్వొచ్చు.. అంటే, ఈ సీజన్ మొత్తంలోనే నబీల్ నామినేషన్స్‌లోకి రాడన్నమాట.
పదో వారం నామినేషన్స్: ఓటింగ్ ఫలితాలు (లైవ్)
గౌతమ్- 26%
నిఖిల్- 21%
ప్రేరణ- 13%
యష్మి- 10%
విష్ణుప్రియ- 10%
పృథ్వీ- 10%
హరి తేజ- 9%