బిగ్‌బాస్ సీజన్ 8 (Bigg Boss Telugu 8) ప్రస్తుతం పదో వారం నామినేషన్స్ ఇంట్రెస్టింగ్గా సాగుతున్నాయి. తొమ్మిదో వారం వైల్డ్ కార్డ్ ద్వారా హౌజ్‌లోకి ఎంటర్ అయిన నయని పావని ఎలిమినేట్ అయ్యింది. ఇక ఈ వారం ఏడుగురు నామినేషన్ కంటెస్టెంట్స్ ఉన్నారు. నిఖిల్, పృథ్వీ, యష్మీ, ప్రేరణ, విష్ణుప్రియ, హరితేజ, గౌతమ్ నామినేషన్స్‌లో ఉన్నారు.
ప్రస్తుత ఈ సీజన్ 8 హౌస్‌లో అసలు టాస్క్‌లు మొదలయ్యాయి. ఈక్రమంలో నామినేషన్లలో ఇచ్చిపడేసిన గౌతమ్.. కన్నడ బ్యాచ్‌కు నిద్ర లేకండా చేస్తున్నాడు. పదో వారంలో ఓటింగ్‌లో నిఖిల్‌ని వెనక్కినెట్టి 27 శాతం ఓట్లతో టాప్‌లో నిలిచాడు అశ్వర్థామ 4.0 గౌతమ్ కృష్ణ. ఇపుడు హయ్యెస్ట్ ఓటింగ్‌తో దూసుకెళ్తున్నాడు గౌతమ్. ఎంతలా అంటే విన్నర్ మెటీరియల్‌గా వచ్చిన నిఖిల్‌ను పక్కకు నెట్టేసి, దాటేసి మరి టాప్‌లో పరిగెడుతున్నాడు. 25.44 శాతం ఓటింగ్, 7,450 ఓట్లతో గౌతమ్ టాప్‌లో ఉన్నాడు. నిఖిల్ 19.3 శాతం ఓటింగ్, 5,651 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
ఈ వారం యాంకర్ విష్ణు ప్రియ, హరితేజ చివరి రెండుస్థానంలో నిలిచారు. ఇక బిగ్ బాస్ అనాలసిస్ట్ ప్రకారం.. ఈ వారం హరితేజ ఎలిమినేట్ అయ్యే అవకాశం కనిపిస్తోందని చెబుతున్నారు. అయితే, ఇక్కడ హరితేజకు 7.86 శాతం ఓటింగ్, 2,301 ఓట్లతో చివరి రెండో స్థానంలో (6th ప్లేస్) ఉంది. విష్ణుప్రియ 7.4 శాతం ఓటింగ్, 2,168 ఓట్లతో లాస్ట్ ప్లేస్‌లో ఉంది. కానీ, ఇక్కడ హరితేజ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.
Also Read :- మరదలుగా ఉన్న సమంత నాకు చెల్లెలు అయింది..
ఎందుకంటే.. యాంకర్ విష్ణు ప్రియకి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. అంటే, విష్ణు ప్రియ హౌస్‌లో ఉంటేనే లవ్ ట్రాక్ సాగుతోందని బిగ్‌బాస్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కాగా యష్మీ ఐదో స్థానంలో ఉంది. దాంతో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది హరితేజ కావొచ్చు.. లేదంటే యష్మి కూడా అయ్యే ఛాన్సెస్ లేకపోలేదు.
ఇకపోతే కంటెస్టెంట్‌గా వచ్చిన చీఫ్ గెస్ట్ గంగవ్వ ఈవారం కాకపోతే వచ్చేవారమైనా హౌస్‌ను వీడాల్సిందే అని తనను పంపిస్తే.. హరితేజ సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి నాగార్జున ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడో తెలియాలంటే రెండ్రోజులు ఆగాల్సిందే.
పదో వారం ఫస్ట్ డే ఓటింగ్‌లో ఎవరెక్కడ ఉన్నారంటే::
1. గౌతమ్ కృష్ణ 27 శాతం
2. నిఖిల్ 19 శాతం
3. ప్రేరణ 18 శాతం
4. పృథ్వీ 14 శాతం
5. యష్మీ గౌడ 9 శాతం
6. విష్ణు ప్రియ 7 శాతం
7. హరితేజ 6 శాతం