Bigg Boss: బిగ్ బాస్ ఓటింగ్ తారుమారు.. టాప్‌లోకి ఎలిమినేషన్ కంటెస్టెంట్.. డేంజర్‌లో ఇద్దరు!

Bigg Boss: బిగ్ బాస్ ఓటింగ్ తారుమారు.. టాప్‌లోకి ఎలిమినేషన్ కంటెస్టెంట్.. డేంజర్‌లో ఇద్దరు!

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-8 (Bigg Boss Telugu 8) వరుస ట్విస్టులతో సాగుతోంది. ఈ వారం హౌజ్లో నుంచి వెళ్లిపోయిన వాళ్లతో నామినేషన్లు చేయించారు. రెండో రోజున మంగళవారం (నవంబర్ 19) నాడు జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో ఆదిత్య ఓం, కిర్రాక్ సీత, నాగ మణికంఠ వచ్చి నామినేట్ చేశారు. ఇక ఈ వారం నామినేషన్స్లో నిఖిల్, ప్రేరణ, పృథ్వీ, యష్మీ, నబీల్ ఐదుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు.

అయితే, ఈ నామినేషన్ ప్రక్రియ రెండు రోజులు జరిగాయి. ఎవరు ఎవర్ని నామినేట్ చేశారనేది షోలో ఆసక్తికరంగా సాగింది. ఫస్ట్ డే సోనియా ఆకుల .. నిఖిల్, ప్రేరణలను నామినేట్ చేయగా.. శేఖర్ బాషా వచ్చి యష్మీ, ప్రేరణలను నామినేట్ చేశాడు. అలాగే బెజవాడ బేబక్క.. నిఖిల్, ప్రేరణలను నామినేట్ చేసింది.

ALSO READ : Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ పై మరో కేసు నమోదు.. విచారణకు రావాలని నోటీసులు

ఇక టాప్ కంటెస్టెంట్గా ఉంటాడన్న మణికంఠ.. నిఖిల్, నబీల్‌లను నామినేట్ చేశాడు. ఆదిత్య ఓం.. ప్రేరణ, యష్మీలను నామినేట్ చేశాడు. ఇకపోతే నైనిక.. యష్మీ, నబీల్‌లను నామినేట్ చేసింది. అయితే.. ఒక్క విషయం చెప్పుకోవాలంటే.. ఈ సారి పూర్తిగా భిన్నంగా నామినేషన్స్ ప్రక్రియ నిర్వహించారు. ఏ సీజన్‌లో చేయనివిధంగా, బిగ్ బాస్ చరిత్రలోనే మొదటిసారిగా ఎలిమినేట్ అయిన ఎక్స్ కంటెస్టెంట్స్‌తో నామినేషన్స్ చేయించడం అనేది బిగ్ బాస్ ఆడియన్స్కి కొత్త రుచి చూపించింది.

ఓటింగ్ పోల్స్:

ప్రస్తుతం ఈ పన్నెండో వారం హౌజ్‌లో పదిమంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. వారిలో గౌతమ్, నిఖిల్, నబీల్, పృథ్వీ, యష్మీ, ప్రేరణ, అవినాష్, రోహిణి, విష్ణుప్రియ, టేస్టీ తేజ ఉన్నారు. ఈ నామినేషన్ ప్రక్రియ కంప్లీట్ అవ్వగానే.. ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయ్యాయి. ప్రస్తుత నామినేషన్స్లో నిఖిల్, ప్రేరణ, పృథ్వీ, యష్మీ, నబీల్ ఐదుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు.

అయితే, ఈ బిగ్ బాస్ ఓటింగ్‌ ఫస్ట్డే ఊహించని విధంగా టాప్లో ఉన్నవారు.. లాస్ట్లో ఉన్నవారు ఛేంజ్ అయిపోయారు. ఐదవ స్థానంలో కొనసాగుతోన్న యష్మీ గౌడ అనుకోకుండా టాప్‌లోకి దూసుకొచ్చింది. దీంతో ఫస్ట్ డే బిగ్ బాస్ ఓటింగ్ తారుమారు అయింది. దాంతో టాప్ 2 ప్లేస్‌లోకి యష్మీ వచ్చి చేరింది. డేంజర్ జోన్‌లో నిఖిల్, పృథ్వీ ఉన్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. లాస్ట్ వీక్ ఓటింగ్స్తో టాప్ 2లో ఉన్న నిఖిల్ ఒక్కసారిగా నాలుగో స్థానంలోకి వచ్చి చేరాడు. టాప్ 5 లో ఉన్న యష్మీ రెండో స్థానంలో నిలిచింది.

అన్ అఫీషియల్ ఓటింగ్ ప్రకారం:

ప్రేరణ 21.44 % (8,828 ఓట్లు) 
యష్మీ గౌడక 20.9 % (8,606 ఓట్లు)
నబీల్ 20.43%, (8,411 ఓట్లు)
నిఖిల్‌ 19.8%, (8,153 ఓట్లు)
 పృథ్వీ17.43%, (7,179 ఓట్లు)

కాగా ఇది అన్ లైన్ లో జరుగుతున్న ఆన్ అఫీషియల్ ఓటింగ్ శాతం ప్రకారం కంటెస్టెంట్స్ స్థానాలు ఇలా ఉన్నాయి. అయితే, బిగ్ బాస్  అధికారిక ఓటింగ్ అనేది రివీల్ చేయరు కాబట్టి.. ఆడియన్స్ వేసే అంచనా దాదాపు నిజం అవుతూ వస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్ట్ పృథ్వీ అనేది అర్ధమవుతోంది. మొత్తానికి కన్నడ బ్యాచ్ నుండి మొదటి ఎలిమినేషన్ జరగనుందన్నమాట.

నిన్నటి వరకు (నవంబర్ 20) యష్మి అవుతుందని అందరు అనుకున్నప్పటికీ లేటెస్ట్ ఓటింగ్ తో టాప్ 2 లో వచ్చి చేరింది. కాగా ఈ ఓటింగ్ అనేది వీకెండ్ వచ్చే వరకు జరుగుతోంది కాబట్టి వీరి స్థానాలు మారే అవకాశం ఉంది.