బిగ్బాస్ సీజన్ 8 (Bigg Boss Telugu 8) చివరి దశకు వచ్చింది. ప్రస్తుతం డిసెంబర్ 2తో పద్నాలుగో వారం మొదలైంది. ఇంకా ఈ షో గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 15న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో షో రసవత్తరంగా సాగుతోంది. పదమూడో వారంలో టేస్టీ తేజ, కన్నడ బ్యాచ్ పృథ్వీరాజ్ శెట్టి (Prithvi Raj Shetty) ఇద్దరూ ఎలిమినేట్ అయి హౌజ్‌నుంచి వెళ్లిపోయారు. ఇక ఈ వారం డేంజర్ జోన్లో ఉన్నదెవరు? ఎవరికి ఓటింగ్ శాతం ఎక్కువుంది? అనేది చూద్దాం.
టికెట్ టు ఫినాలే గెలుచుకున్న అవినాష్ నేరుగా ఫైనల్ కి వెళ్ళాడు. ఇక ఈ ఫైనల్ వీక్ నామినేషన్స్‌లో విష్ణుప్రియ, నిఖిల్, గౌతమ్, రోహిణి, నబీల్, ప్రేరణ ఆరుగురు ఉన్నారు. అయితే, వీరిలో ఎవరైనా నలుగురు కంటెస్టెంట్స్ మాత్రమే ఫైనల్ కి వెళతారు. ఈ వారంలో ఒకరు ఎలిమినేట్ అవుతారు.
ఇంకో విషయం కూడా గుర్తుంచుకోవాలి.. అదేంటంటే, గత సీజన్లో మాదిరి ఒకరిని ఎలిమినేట్ చేసి ఆరుగురిని ఫైనల్కి పంపినా ఆశ్చర్యం లేదు. కాగా బిగ్ బాస్ షోని మొదటి నుంచి చూస్తూ వస్తోన్న ఆడియన్స్కి విజేత ఎవరనేది తెలిసిపోతుంది. అయితే, ఈ వారం బిగ్ బాస్ ఓటింగ్‌లో కంటెస్టెంట్ల స్థానాలు గజిబిజిగా మారాయి.
Also Read:-క్యాన్సర్ తో హాస్పిటల్ లో చేరిన బిగ్ బాస్ కంటెస్టెంట్..
ఎప్పటిలాగే గౌతమ్, నిఖిల్ టాప్ ఓటింగ్తో దూసుకెళ్తున్నారు. చివరి స్థానాల్లో ఉన్న నబీల్ మూడో స్థానానికి వెళ్లిపోయాడు. ఇక డేంజర్లో ఉన్న విష్ణుప్రియ నాలుగోవ స్థానానికి చేరింది. ఇవాళ శుక్రవారం రాత్రిలోపు ఓటింగ్ కంప్లీట్ అవుతుంది. దీంతో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయని.. సోషల్ మీడియాలో అనధికారిక లిస్టు ఒకటి వైరల్ అవుతోంది. ఇక ఈ పద్నాలుగో వారం ఎవరు ఎలిమినేట్ అన్నది శనివారం సాయంత్రం లోపు తెలుస్తోంది.
ఆన్ లైన్లో అనధికారికంగా జరుగుతున్న ఓటింగ్ ప్రకారం:
గౌతమ్-23% తో ఫస్ట్ ప్లేస్
నిఖిల్-22 %
నబీల్-17%
విష్ణుప్రియ-13% సేఫ్ జోన్‌లో ఉంది.
ప్రేరణ-13%
రోహిణి-12%
ఈ లెక్కన చూస్తే బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారంలో ప్రేరణ, రోహిణి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే, గౌతమ్, నిఖిల్ ఇద్దరిలో ఒకరు టైటిల్ విన్నర్గా నిలిచే అవకాశం ఉంది.