Vishnupriya V/s Sonia: విష్ణుప్రియకు బట్టలు కూడా మార్చుకోవడం రాదంటూ..సోనియా పర్సనల్ అటాక్!

బిగ్ బాస్ తెలుగు 8 మంగళవారం సెప్టెంబర్ 10న జరిగిన ఎపిసోడ్‌లో రెండో వారం నామినేషన్స్‌లో ప్రక్రియ పూర్తయింది. ఈ నామినేషన్స్ ప్రక్రియ రెండ్రోజులు జరిగాయి. ఈ ఎపిసోడ్స్ తో ఆడియన్స్ బానే ఎంజాయ్ చేశారు.

అయితే, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఏం రచ్చ జరుగుతుంది అంటే అది విష్ణు ప్రియా సోనియా మధ్య జరిగే వాగ్వాదమే.. ఇద్దరు చిన్న విషయానికి అగ్గి రాజేసుకొని రచ్చ రచ్చ చేసుకుంటున్నారు. కాగా ఇందులో ఫస్ట్ డే నామినేషన్స్‌లో యాంకర్ విష్ణుప్రియపై సోనియా ఆకుల చేసిన కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. 

విష్ణు ప్రియను నామినేట్ చేసిన సోనియా ఆమె సరిగ్గా బట్టలు వేసుకోదని..ఆమె వల్ల హౌస్ లో ఉన్న మిగతా మెల్ కంటెస్టెంట్స్ అంత ఇబ్బంది పడుతున్నారని వాగేసింది. అయితే, విష్ణుప్రియ బట్టలు మార్చుకునే సమయంలో ఆదిత్య వెళ్లినట్లు, అప్పుడు అతను డిస్‌కంఫర్ట్ అయ్యేలా విష్ణుప్రియ చేసినట్లు సోనియా చాడీలు చెప్పింది.

అంతేకాకుండా తను బాగా అడల్ట్స్ జోక్స్ వేస్తుందని, అందుకోసమే తనను బిగ్ బాస్ షోకి తీసుకున్నారని, తనను మాత్రం అందుకు తీసుకోలేదని చెప్పింది.అది మాత్రమే కాదు నీకు ఫ్యామిలీ లేకపోవచ్చు నాకు ఫ్యామిలీ ఉంది. నా ఫ్యామిలీ నన్ను చూస్తుంది అంటూ తన నోటికి వచ్చినట్టు సోనియా మాటలు విసిరింది. దీంతో విష్ణుప్రియకు ఫ్యామిలీ లేదని చాలా పర్సనల్ అటాక్ చేస్తూ క్యారెక్టర్ అసాసినేషన్ (వ్యక్తిత్వంపై నిందలు వేయడం) చేసింది సోనియా ఆకుల.

అయితే సోనియా ఆకుల ముందు చెప్పినట్టుగా..గమనించిన కూడా విష్ణు ప్రియా ఎక్కడ తప్ప చేసినట్టు.. ఆమె అన్ కంఫర్ట్బుల్ బట్టలు వేసుకున్నట్టు కనిపించలేదు..ఈ షో కు వెళ్లినప్పటి నుంచి కూడా విష్ణు ప్రియ పొట్టి పొట్టి బట్టలు కానీ తను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసినట్టు ఉండే ఫోటో షూట్ బట్టలు కానీ ఎక్కడ వేసుకోలేదు. అలానే సోనియా అంత రచ్చ చేసింది.. అంత అన్ కంఫర్ట్బుల్ ఫీల్ అయ్యింది ఆదిత్య ఓం అని అతనికి కూడా తెలియకపోవడం గమనించాల్సిన విషయం.

విష్ణుప్రియ చీర మార్చుకునేటప్పుడు ఆదిత్య ఓం సెడన్‌గా వెళ్లారని, అలా వెళ్లినందుకు వెంటనే బయటకు వెళ్లారని, అంతేకానీ, దానికి ఆదిత్యం వణికిపోలేదని రివ్యూవర్స్ చెబుతున్నారు. అలాగే హౌస్ లో ఉండే కంటెస్టెంట్స్ సైతం ఇలా తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. 

"సాధారణంగానే ఆదిత్య గారు ఆడవాళ్లతో డిస్‌కంఫర్ట్ ఉంటారు. ఇలా జరిగే సరికి ఇంకాస్తా ఎక్కువ ఫీల్ అయింటారు కానీ, డిస్‌కంఫర్ట్ కాదు" అని విష్ణుప్రియతో ప్రేరణ అంటే.. "అసలు నామినేట్ చేయాల్సిన పాయింటే కాదు" అని నైనిక చెప్పింది.

ఇకపోతే..ఈ వ్యవహారం అంతా మంగళవారం (సెప్టెంబర్ 10) నాటి ఎపిసోడ్‌లో చూపించలేదు. కానీ, లైవ్‌లో టెలీకాస్ట్ అయింది. ఇవాళ అది టెలీకాస్ట్ చేస్తారో చూడాలి.