Bigg Boss: షాక్.. హౌస్ నుంచి వెళ్లిపోతానన్న మాజీ కంటెస్టెంట్.. డోర్ తెరిచిన బిగ్‍బాస్

బిగ్ బాస్ తెలుగు (Bigg Boss Telugu 8) లేటెస్ట్ 52వ రోజు జరిగిన ఇన్సిడెంట్స్తో రిలీజ్ చేసిన ప్రోమో ఆకట్టుకుంటోంది. సరదా సన్నివేశాలతో హౌస్ కళకళలాడింది. ఒకరికొకరు చాలా ప్రేమగా చూసుకుంటూ.. అన్యోనంగా మాట్లాడుకునే ప్రోమో బాగుంది.

టేస్టీ తేజ ఉండి 'నిఖిల్ బ్రో గోల్డ్ ఎక్కడ తీసుకున్నావ్..మేడలో బాగుంది' అని అనగా యాంకర్ విష్ణుప్రియ వెంటనే' గోల్డ్ గోల్డ్ ఏసుకుని తిరగడం ఫస్ట్ టైం చూస్తున్న'ఆనడంతో నవ్వులు విరబూయాసాయి. ఇక కంటెస్టెంట్స్ అందరూ సరదాగా మేం పోతాం సార్..ఓపెన్ ది డోర్..అంటూ అనడంతో.. చల్ ప్యాకప్.. వెళతా అంటూ అవినాశ్.. హౌస్ డోర్ వద్దకు వెళ్లారు. దీంతో డోర్ ఓపెన్ చేయాలి అని నిఖిల్ అన్నారు.

బిగ్‍బాస్ అప్పుడు నిజంగానే డోర్ తీయడంతో అవినాశ్ షాకయ్యారు. ఇక కంటెస్టెంట్స్ అందరూ అవినాశ్‍ను బయటికి పంపేందుకు బాగా ట్రై చేశారు.కాళ్లు, చేతులు పట్టుకొని డోర్ వద్దకు తీసుకెళ్లారు హౌస్ మేట్స్. ఇంకోసారి వెళతావా అంటూ భయపెట్టేసారు. ఇదంతా ఫన్నీగా సాగింది. డోర్స్ మూసేయండి అని అవినాశ్, తేజ అడిగారు.

అలాగే అవినాశ్ జిమ్ ట్రైనర్‌గా మారి ఇంటి సభ్యులకు వర్కౌట్స్ ఎలా చేయాలో చెప్పాలని బిగ్‍బాస్ ఆదేశించారు. దీంతో నేనా అన్నట్టు అతడు వెరైటీ ఎక్స్‌ప్రెషన్ ఇస్తూనే.. తేజకు నేర్పించడం.. అక్కడ క్రియేట్ అయిన ఫన్ ని హౌస్ మెట్ ఎంజాయ్ చేయడం సరదాగా సాగింది.

ఇకపోతే ఎనిమిదో వారం నామినేషన్ల ప్రక్రియ రసవత్తరంగానే సాగింది తెలిసిందే. ఇపుడు మొత్తంగా ఆరుగురు నామినేషన్లలో నిలిచారు. మహబూబ్, ప్రేరణ, నిఖిల్, నయని పావని, పృథ్విరాజ్, విష్ణుప్రియ నామినేషన్లలో ఉన్నారు.