బిగ్ బాస్ సీజన్ 8 (Bigg Boss 8 Telugu) ఫైనల్కి కౌంట్ డౌన్ మొదలైంది. ఫైనల్కి చేరిన ఐదుగురి కంటెస్టెంట్లో అందరు తమ ఆటతో అదరగొడుతున్నారు. ఎవ్వరి అంచనాలు వాళ్ళకి ఉన్నాయి. తమ అభిమానాలు ఎక్కడ తగ్గకుండా వారికి ఓట్లు గుద్దుతున్నారు. టైటిల్ విన్నర్ ఎవరనేది.. ఆన్ లైన్లో ఎవ్వరికీ నచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మరి నిజంగా టైటిల్ గెలిచేదెవరు? రన్నర్గా ఎవరు నిలిచే అవకాశం ఉంది? ప్రస్తుతం ఆడియన్స్ ఓట్లతో ఎవరు లీడింగ్లో ఉన్నారు? అనే వివరాలు చూద్దాం.
ప్రస్తుతం హౌజ్లో నిఖిల్, ప్రేరణ, అవినాష్, నబీల్ అఫ్రిది, గౌతం కృష్ణ ఉన్నారు. ఇందులో నిఖిల్ మరియు గౌతమ్ కృష్ణ లీడ్ లో కొనసాగుతున్నారు. ఈ ఇద్దరి మధ్యే యుద్ధం రసవత్తరంగా ఉంది. ఇప్పుడు జరుగుతున్న ఓటింగ్ ట్రెండ్‌లు మరియు ప్రేక్షకుల అంతిమ ఎంపికపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అయితే, ఆడియన్స్ ఎక్కువగా వీరిద్దరికి తమ ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. అయితే, ముందునుంచైనా వీరిద్దరికే ఫ్యాన్స్ ఫాల్లోవింగ్, బిగ్ బాస్ ఆడియన్స్ ల మద్దతు ఎక్కువగా ఉంది.
అయితే, నిఖిల్ మలియక్కల్ కన్నడకి చెందిన కంటెస్టెంట్. గౌతమ్ కృష్ణ తెలుగువాడు. దాంతో ఈ సీజన్ 8లో మన తెలుగు వ్యక్తి ఐన గౌతమ్ని గెలిపించుకోవాలని ఆడియన్స్ బాగా కష్టపడుతున్నారు. అందుకు తగినట్లే గౌతమ్ ను ముందంజలో ఉంచడానికి ఫ్యాన్స్ తమ ఓట్లతో మద్దతు తెలుపుతున్నారు. ఇక ఆ మధ్య నిఖిల్ తన ఆటలో కాస్తా అటు ఇటూ ఆడి నెగిటివ్ మార్క్ తెచ్చుకున్నాడు. కానీ, నిఖిల్ ఫ్యాన్స్ మాత్రం తనకే ఓట్లు బాగా గుద్దేస్తున్నారు. ఏదేమైనా వీరిద్దరూ తమ ఆటతో బాగా రాణిస్తున్నారు.
వీరిలో ఒకరు విన్నర్ గా నిలిచిన.. రన్నర్ అయ్యే వ్యక్తికీ ఓట్ల వ్యత్యాసం తక్కువగానే ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే చివరి నిమిషం వరకు విన్నర్ ఎవరనేది సస్పెన్స్ గా మారింది. ఇకపోతే ఓటింగ్ కి ఇవాళే ఆఖరు రోజు కావడంతో ఓటింగ్ శాతం ఎవరికి ఎలా ఉంటుందని చెప్పలేం. ఎందుకంటే ప్రతి నిమిషానికి వీరిద్దరి స్థానాలు మారుతూ వస్తున్నాయి. డిసెంబర్ 13 అర్థరాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు బిగ్ బాస్ ఓటింగ్ వేసేందుకు అవకాశం ఉంది.
ఇక బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్‌ను ప్రకటించే సమయంలోనే ఎవరికి ఎంత ఓటింగ్ వచ్చిందనేది హోస్ట్ నాగార్జున చెప్పే అవకాశం ఉంది. కాబట్టి బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్ ఎవరనేది మాత్రం తెలియాలంటే గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 15 వరకు వెయిట్ చేయాల్సిందే.