Shekar Basha Remuneration: శేఖ‌ర్ బాషా బిగ్‌బాస్ రెమ్యూనరేషన్.. రెండు వారాల్లో ద‌క్కింది ఎన్ని లక్షలంటే?

Shekar Basha Remuneration: శేఖ‌ర్ బాషా బిగ్‌బాస్ రెమ్యూనరేషన్.. రెండు వారాల్లో ద‌క్కింది ఎన్ని లక్షలంటే?

శేఖ‌ర్ బాషా (Shekar Basha)..ఆర్జేగా ఒకప్పుడు పాపులర్. షోలోకి రాకముందు రాజ్ తరుణ్-లావణ్య వివాదంలో ఎంటరై కాస్త క్రేజ్ తెచ్చుకున్నాడు. అలానే బిగ్‌బాస్ హౌసులోనూ కామెడీ చేసే బాధ్యతలు తీసుకున్నాడు. రెండు వారాలపాటు ప్రేక్షకులకు తనదైన ఆటతో అలరించాడు. ఇలా  శేఖ‌ర్ బాషా రెండు వారాలకు గాను ఎంత రెమ్యున‌రేష‌న్ తీసుకున్నాడో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే.. 

బిగ్‌బాస్ 8 తెలుగు రెండో వారంలో RJ శేఖ‌ర్ బాషా ఎలిమినేట్ అయ్యాడు. ఈ సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా వచ్చినప్పటి నుంచే శేఖర్ బాషా తనదైన మార్కు చూపించే ప్రయత్నాలు చేశాడు. ముఖ్యంగా షోలో తనదైన రీతిలో జోకులు చెప్తూ ఫన్ క్రియేట్ చేస్తున్నాడు.

అయితే, స్ట్రాంగ్ కంటెస్టెంట్‌లో ఒక‌రిగా ఉన్న శేఖర్ భాషా ఉన్నట్టుండి ఎలిమినేట్ అవ్వడంతో ప్రేక్షకుల నుంచి, నెటిజన్స్ నుంచి పలు రకాలైన అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. కారణాలు ఏవైనప్పటికీ..పలు జ్ఞాపకాలతో బిగ్‌బాస్ 8 సీజన్ నుంచి తన ఎలిమినేషన్ జరిగింది. 

ఇకపోతే.. అతను హౌస్ లో ఉన్న రెండు వారాలకు గాను మోస్తారు రెమ్యున‌రేష‌న్ అందుకున్న‌ట్లు స‌మాచారం. రోజుకు 35 వేల చొప్పున‌...వారానికి రూ.2.50 లక్షల రెమ్యున‌రేష‌న్‌తో శేఖ‌ర్ బాషా బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన‌ట్లు చెబుతోన్నారు. అలా 2 వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న బాషా మొత్తంగా రూ. 5 లక్షలు రెమ్యూనరేషన్‌గా తీసుకున్నాడని టాక్ వినిపిస్తోంది. 

ఇదిలా ఉంటే ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన శేఖర్ బాషా మరోసారి బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మరో మూడు వారాల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండనున్నాయి. అప్పుడు అతను కూడా మళ్లీ హౌస్ లోకి అడుగు పెట్టనున్నాడని టాక్ వినిపిస్తోంది.ఏమవుతుందో చూడాలి. 

కాగా రీసెంట్ గా తండ్రిగా ప్రమోషన్ పొందాడు శేఖర్.శనివారం జరిగిన ఎపిసోడ్ లో శేఖర్ బాషాకు కొడుకు పుట్టాడని నాగార్జున చెప్పడంతో అతను ఎమోషనల్ అయ్యాడు.ఈ విషయం తెలియడంతో శేఖర్ బాషానే బయటకి వెళ్లిపోవాలని ఫిక్స్ అయ్యాడని సమాచారం.

తన భార్య, కొడుకుని చూడాలని, ఈ సమయంలో వాళ్ళ దగ్గర ఉండాలని..శేఖర్ బాషా అనుకోని తనే స్వయంగా వెళ్లిపోవడానికి నిర్ణయం తీసుకోవడంతో..దీంతో శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యేట్టు బిగ్ బాస్ ప్లాన్ చేసిందని పలువురు భావిస్తున్నారు. ఈ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.